సంజనతో కాజల్ ఫోటో… కొత్త సందేహాలకు తెరలేపుతుందిగా..!

బాలీవుడ్ తో పాటు శాండిల్ వుడ్ లో కూడా డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ మరియు బాలీవుడ్ హీరోయిన్ అయిన రియా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ డ్రగ్ డీలర్లతో కన్నడ చిత్ర సీమకు కూడా సంబంధాలు ఉన్నట్టు ఎన్.సి.బి(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వివరాలు చేపట్టడంతో బెంగుళూర్ పోలీసులతో కలిసి అక్కడ కూడా దర్యాప్తు చేపట్టింది.

ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి ద్వివేదితో పాటు సంజ‌న‌ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంజన బ్లడ్ శాంపుల్స్ మరియు యూరిన్ సాంపుల్స్ ను టెస్టుల కోసం ఇవ్వమని డాక్టర్లు కోరగా.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె పై మరింత నిఘా పెట్టారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్.. సంజ‌న‌తో క‌లిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాసినోలో కాజల్ డ‌బ్బులు పెడుతున్నట్టు ఈ ఫొటో స్పష్టం చేస్తుంది.

ఇది పాత ఫోటోనే అయినప్పటికీ.. కాజల్ అభిమానులు కంగారు పడుతున్నారు. ‘కొంపతీసి కాజల్ ను కూడా డ్రగ్స్ కేసులో ఇరికించరు కదా?’ అంటూ ఆందోళన చెందుతున్నారు. అయితే కాసినో ప్రమోషన్స్ లో తాప్సీ, త‌మ‌న్నా, హ‌న్సిక‌, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా పాల్గొన్నారు. కాబట్టి అంత కంగారు పడాల్సిన పనిలేదు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus