చిన్న సినిమాలకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరుగుతుంది అని కచ్చితంగా చెప్పలేం. ఆ సినిమాలను కొనుగోలు చేయడానికి బయ్యర్స్ కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. వాటికి బిజినెస్ జరగాలి అంటే.. ముందు నుండీ ప్రమోషన్స్ వంటివి బాగా చేయాలి. స్పెషల్ స్క్రీనింగ్లు వంటివి ఏర్పాటు చేయాలి. వాటికి ఇండస్ట్రీ పెద్దలను ఆహ్వానించాలి. వాళ్ళు మంచి టాక్ కనుక చెబితే.. అప్పుడు బయ్యర్స్ ఆ సినిమాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు.
ఒకవేళ థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా.. వాటికి డిజిటల్ లేదా శాటిలైట్ బిజినెస్..లు బాగా జరిగే అవకాశం ఉంటుంది. చాలా చిన్న సినిమాలకి ఇది జరిగింది. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమాకి వింత పరిస్థితి చోటు చేసుకుంది. విషయం ఏంటంటే.. ‘కలియుగ పట్టణంలో’ (Kaliyugam Pattanamlo) అనే చిన్న సినిమా నిన్న అంటే మార్చి 29 న రిలీజ్ అయ్యింది. అయితే మొన్న అంటే ఈ సినిమాకి ప్రివ్యూ వేయడం కూడా జరిగింది.
షో అయ్యాక.. చూసిన వారు పాజిటివ్ కామెంట్స్ చేశారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గా వచ్చాయి. అయితే మార్నింగ్ షోలు మధ్యలోనే నిలిపేశారు. అలాగే రిలీజ్ కూడా వాయిదా పడినట్టు.. మేకర్స్ ప్రకటించారు. ఒకవేళ రిలీజ్ పక్కాగా ఉండి ఉంటే.. వీకెండ్ కొద్దిపాటి ఆక్యుపెన్సీలు అయినా రిజిస్టర్ అయ్యి ఉండేవి. అలాగే ఓటీటీ, శాటిలైట్ బిజినెస్..లకి వెంటనే మంచి ఆఫర్లు వచ్చి ఉండేవి. మరి ‘కలియుగ పట్టణంలో’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి