‘మే 9’… ఈ డేట్ గురించి ప్రపంచ సినిమా వెయిట్ చేస్తోంది. టీజర్లు, ట్రైలర్లతో వచ్చిన క్రేజ్ కాదు ఇది. కేవలం సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకుడు (Nag Ashwin) నాగ్ అశ్విన్ చెప్పిన విషయాలే దానికి కారణం. ఆ సినిమానే (Kalki 2898 AD) ‘కల్కి 2898 ఏడీ’. (Prabhas) ప్రభాస్, (Deepika Padukone) దీపిక పడుకొణె జంటగా వైజయంతి మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందలో (Amitabh Bachchan) అమితాబ్ బచ్చన్, (Kamal Haasan) కమల్ హాసన్, దిశా పటానీ (Disha Patani) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ మ్యాజికల్ డేట్ మే 9న తీసుకొస్తామని టీమ్ చెప్పింది.
ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటిలో సినిమా పోస్ట్ పోన్ వార్తలు కూడా ఉన్నాయి. ఆ విషయం పక్కనపెడితే సినిమాలో పాత్రలు ఇలా ఉంటాయని, పేర్లు ఇవని చెబుతున్నారు. తాజాగా ఈ విషయంలో ఇంకాస్త క్లారిటీ పుకారు వచ్చింది. సినిమా పేరులోని కల్కి… హీరో పేరే అని. విష్ణుమూర్తి చివరి అవతారం అని అంటున్నారు. ఇక దీపిక పడుకొణె సినిమాలో పద్మగా కనిపించబోతోందట. లక్ష్మి దేవి పునర్జన్మ పాత్రగా ఆమె కనిపిస్తుందట.
సినిమాలో ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపిస్తారని టాక్. అయితే వీరి మధ్య కమర్షియల్ సాంగ్స్ ఉండవట. ఎమోషనల్, ఫీల్ గుడ్ పాటలు ఉంటాయట. మరోవైపు ‘కల్కి’ సినిమా టీమ్ ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ప్రభాస్, దిశా పటానీ మీద ఓ పాట ప్లాన్ చేశారు. అయితే కల్కి కథకు, ఇటలీ లొకేషన్లు ఎలా సెట్ అవుతాయి అనే మరో చర్చ కూడా నడుస్తోంది. దీపికతో అలా, దిశాతో ఇలానా అని అడుగుతున్నారు ఫ్యాన్స్.
భవిష్యత్తు కథతో ‘కల్కి 28998 ఏడీ’ సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. 2898 సంవత్సరంలో జరిగిన కథగా ఈ సినిమాను చూపిస్తారట. అయితే నేటి తరం నుండి అక్కడకు టైమ్ ట్రావెల్ చేస్తారు అని చెబుతున్నారు. అలాగే గతంలోకి కూడా వెళ్తారు అని సమాచారం.
ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!
ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?