Kalki: కల్కి 2898 లీక్ ల వెనుక ఉన్న కథ అదేనా.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీస్ లో ప్రాజెక్ట్ కే అలియాస్ కల్కి 2898 కూడా ఒకటి. మహానటి ఫేమ్ నాగస్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ , ఇంట్రో టీజర్ ఒక రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల్లో అతని గెటప్ ల పరంగా కూడా ఇది బెస్ట్ అని అంతా అభిప్రాయపడుతున్నారు. విజువల్ గా కూడా ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది.

2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుందని అని ప్రకటించారు కానీ మళ్ళీ సమ్మర్ కి వాయిదా పడినట్లు టాక్ నడుస్తుంది. ఇది పక్కన పెడితే.. కల్కి నుండీ కొన్ని లీక్.. లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎడిటింగ్ రూమ్ నుండే ఈ లీక్ లు వస్తున్నట్లు అవి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇంత పెద్ద సినిమాకి (Kalki) ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోరా అనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మరి కొంతమంది అసలు ప్రమోషన్ కోసమే ఇలా టీం లీక్ లు వదులుతున్నారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోయి పోయి ప్రభాస్ సినిమాకి ఇలాంటి చీప్ ట్రిక్ లు ప్లే చేయరు కదా. పైగా చిత్ర బృందం కూడా ఈ లీక్ లకు చాలా భయపడుతున్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus