మెగా డాటర్ శ్రీజ తన రెండవ భర్తకు కూడా విడాకులు ఇచ్చారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా ఈమె తన భర్తకు దూరంగా తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే ఇలా వీరిద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ విడాకులు తీసుకున్నారు అంటూ ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఇలా భర్తకు దూరంగా పిల్లలతో శ్రీజ సంతోషంగా ఉన్నప్పటికీ కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిని వదిలి ఉండలేక తనని చాలా మిస్ అవుతున్నాను అంటూ తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కళ్యాణ్ తాజాగా తన కుమార్తెను మిస్ అవుతున్నానని చెప్పడమే కాకుండా కేవలం వారంలో తనకు నాలుగు గంటలు మాత్రమే ఆనంద క్షణాలు అంటూ ఒక పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె ఫోటోని షేర్ చేసిన ఈయన వారంలో నాలుగు గంటల ఆనంద క్షణాలు అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
కళ్యాణ్ దేవ్ చేసిన ఈ పోస్ట్ కనుక చూస్తే శ్రీజ తో తనకు విడాకులు అధికారకంగా వచ్చాయని స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా భార్యాభర్తలు విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కోర్టు ఇద్దరి వాదోప వాదనలు వింటుంది. ఇలా ఆ జంటకు పిల్లలకు కనుక ఉంటే పిల్లలు ఎవరి వద్ద ఉండాలి ఒకవేళ పిల్లలు తల్లి వద్ద ఉంటే తండ్రి వద్ద ఎప్పుడు ఎంత సమయం పాటు ఉండాలి అన్నది కూడా కోర్టు నిర్ణయిస్తుంది.
ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ కుమార్తె నవిష్క కూడా శ్రీజ వద్దే పెరుగుతూ ఉన్నప్పటికీ వారంలో నాలుగు గంటలు మాత్రం తన తండ్రి వద్ద ఉండటానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని అందుకే ఈయన వారంలో నాలుగు గంటలే ఆనంద క్షణాలు అంటూ అర్థం వచ్చేలా పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు. ఇలా ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరికి అధికారికంగా విడాకులు వచ్చాయని తెలుస్తుంది.