Kalyan Ram: బింబిసార లుక్ చూసి తారక్ అలా అన్నారట!

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బాబాయ్ బాలకృష్ణ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారని విన్నానని చిన్నప్పుడు నేను కూడా బాగా అల్లరి చేసేవాడినని కళ్యాణ్ రామ్ వెల్లడించడం గమనార్హం. చిన్నప్పుడు నేను చాలా ఆటిట్యూడ్ తో ఉండేవాడినని అల్లరి చేసేవాడినని

ఎంత అల్లరి అంటే 13 సంవత్సరాల వయస్సులోనే కారును డ్రైవింగ్ చేసే ఛాన్స్ ఇవ్వకపోతే తలుపు తీసుకొని దూకేస్తానని బెదిరించానని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలు తెలిసి క్లాస్ టీచర్ గట్టిగా క్లాస్ పీకారని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. క్లాస్ టీచర్ అలా చేయడం నన్ను పూర్తిగా మార్చేసిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఏం చూసుకుని ఇంత ఆటిట్యూడ్ అని ఆయన ప్రశ్నించారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

పెద్దాయన వల్లే నీకు ఈ యాటిట్యూడ్ వచ్చిందని అనుకుంటే ఆయనకు మాట రాకుండా చూసుకోవాలని క్లాస్ టీచర్ సూచనలు చేశారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. క్లాస్ టీచర్ చెప్పిన మాటల వల్ల నేను మారిపోయానని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు. నా పిల్లలు అస్సలు అల్లరి చేయరని కళ్యాణ్ రామ్ అన్నారు. పిల్లలను మరీ క్రమశిక్షణతో పెంచుతున్నానని కొన్నిసార్లు అనిపిస్తుందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

రాజు అంటే ప్రభాస్ గుర్తుకొస్తాడని బింబిసార పాత్రకు నేను సూట్ అవుతానా అని అనిపించిందని కళ్యాణ్ రామ్ తెలిపారు. బింబిసార గెటప్ లో నన్ను చూసి బాగున్నావన్నా అని తారక్ అన్నారని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రొడక్షన్ వ్యవహారాలను బావ హరికి అప్పగించానని కళ్యాణ్ రామ్ కామెంట్లు చేశారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus