Kalyan Ram: ఇది టాలీవుడ్‌ విజయమంటున్న కల్యాణ్‌రామ్‌!

టాలీవుడ్‌కి మోస్ట్‌ అవైటెడ్‌ కిక్‌ ఇచ్చిన చిత్రం ‘బింబిసార’. కల్యాణ్‌ రామ్‌ హీరోగా మల్లిడి వశిష్ట్‌ తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. తొలి రోజు కలక్షన్ల విషయంలో చిన్నపాటి ఇబ్బంది కనిపించినా.. రెండో రోజు నుండి అద్భుతంగా ఉన్నాయనే టాక్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌ ఓ ఎమోషన్‌ పోస్ట్‌ పెట్టారు. సినిమా గురించి తన టీమ్‌ పడ్డ కష్టాన్ని వివరిస్తూ, ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

‘‘2019లో ‘బింబిసార’ సినిమా వర్క్ స్టార్ట్ చేశాం. ఈ కథను సినిమాగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చాలా ఆతృతగా అనిపించింది. అయితే కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ వల్ల మా ఎక్సైట్‌మెంట్‌ కాస్త టెన్షన్‌గా మారింది. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ఈ సినిమాను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయాలని సంకల్పించుకున్నాం. మా కష్టం, సినిమా మీద మా ప్యాషన్‌ ప్రేక్షకులకు చూపించి, వారితో మన్ననలు పొందాలని కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని రాసుకొచ్చారు కల్యాణ్‌ రామ్‌.

‘‘బింబిసార’ సినిమా విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే సినిమా స్థాయి, సినిమా కోసం టీమ్‌ పడ్డ కష్టం అలాంటిది. ఇప్పుడు సినిమాకు వస్తున్న స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో అద్భుతంగా నడుస్తోంది. మా సినిమాను ఆశీర్వదించిన ప్రేక్షకులకు, సినిమా పరిశ్రమ ప్రముఖులకు, మీడియాకు, శ్రేయోభిలాషులకు, సినిమా ప్రేమికులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు’’ అంటూ కల్యాణ్‌ రామ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నోట్‌లో ఆఖరుగా మరోసారి ‘బింబిసార విజయం.. టాలీవుడ్‌ విజయం’ అంటూ రాశారు కల్యాణ్‌రామ్‌.

శుక్రవారం విడుదలైన ఈ సినిమా విజయం పట్ల టాలీవుడ్‌ చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో వరుస పరాజయాలు వచ్చాయి. దీంతో ‘బింబిసార’ విజయం మంచి బూస్టింగ్‌ అని చెప్పాలి. ఈ సినిమాతోపాటు శుక్రవారం వచ్చిన ‘సీతా రామం’ కూడా విజయం అందుకుంది. దీంతో టాలీవుడ్‌ ప్రేక్షకులతోపాటు, సినిమా పెద్దలు కూడా మెచ్చుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus