ఆ రెండు ప్రాజెక్టులు కళ్యాణ్ రామ్ కు కలిసొచ్చేలా ఉన్నాయే..!

కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చెయ్యడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందు ఉంటాడు. అతనికి మినిమం మార్కెట్ ఉన్నప్పటికీ కథ కనుక నచ్చితే.. స్వయంగా తానే ప్రాజెక్టుని నిర్మించడానికి ముందుకు వస్తాడు. ఇప్పటి వరకూ అలా ఎన్నో సినిమాలు నిర్మించాడు. అందులో కొన్ని పర్వాలేదు అనిపించినా.. మరికొన్ని చేదు అనుభవాన్నే ఇచ్చాయి. కోట్లల్లో నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ సినిమా తీసి.. ఆ అప్పులన్నీ తీర్చేసాడు. అప్పటి నుండీ నిర్మాణానికి కొంచెం దూరంగా ఉంటూ.. తన మార్కెట్ కు తగినట్టు మిగిలిన బ్యానెర్లలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో ‘ఎం.ఎల్.ఎ’ వంటి కమర్షియల్ హిట్ అలాగే ‘118’ వంటి డీసెంట్ హిట్ లతో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన కళ్యాణ్ రామ్.. తరువాత ‘ఎంత మంచివాడవురా’ అనే సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసాడు. అయినప్పటికీ.. ఇప్పుడు తన కెరీర్ ను బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు లెండి. ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి ప్రెస్టీజియస్ బ్యానర్లో ఓ చిత్రం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రంతో రాజేంద్ర అనే కుర్రాడు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. కచ్చితంగా ఇది మంచి హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు దిల్ రాజు బ్యానర్లో కూడా కళ్యాణ్ రామ్ ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.

అది ఓ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తుంది. దీనిని కూడా ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తాడని సమాచారం. వీటితో పాటు మల్లాడి వశిష్ఠ అనే యువ దర్శకుడిని పరిచయం చేస్తూ కళ్యాణ్ రామ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీని ‘రావణ’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి 30 కోట్ల పైనే బడ్జెట్ అవుతుందట. ఈ ఒక్కటి కళ్యాణ్ రామ్ చేస్తున్న రిస్క్ అని కానీ మిగిలినవన్నీ కళ్యాణ్ రామ్ కు కలిసొచ్చే ప్రాజెక్టులే అని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా త్రివిక్రమ్- ఎన్టీఆర్ ప్రాజెక్టుకి కూడా కళ్యాణ్ రామ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus