కథానాయకుడిగా కళ్యాణ్ రామ్ “తొలిచూపులోనే” చిత్రంతో కెరీర్ ను ప్రారంభించి 15 ఏళ్లవుతోంది. ఇక నిర్మాతగా తన ప్రస్థానాన్ని అతనొక్కడేతో మొదలెట్టి 13 ఏళ్లయ్యింది. ఇన్ని ఏళ్లలో కళ్యాణ్ రామ్ సరైన హిట్ ను రుచి చూసింది రెండు సార్లు మాత్రమే. కానీ.. ఈసారి ఈ ఏడాదిలోనే రెండు విజయాలు అందుకోబోతున్నానని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన నటించిన “ఎమ్మెల్యే” చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన కళ్యాణ్ రామ్.. “కళ్యాణ్ రామ్ పాలిటిక్స్ లోకి రావాలి” అంటూ పోసాని కృష్ణమురళి చేసిన కామెంట్స్ గురించి వివరిస్తూ.
“హీరో అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అలాగే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తానని కూడా ఊహించలేదు. ప్రొడక్షన్ లో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వగానే అమ్మో ఇంక మనం ఇండస్ట్రీ లో ఉండమేమో అనుకున్నా. కానీ ఇండస్ట్రీలో నిర్మాతగా పదమూడేళ్ళు పూర్తిచేసుకున్నాను. కొన్ని మనం అనుకోం, అస్సలు ఊహించం. జరగాలని ఉంటే జరుగుతుందంతే. అలాగే రాజకీయాల్లోకి రావాలని ఉంటే వస్తనేమో. చెప్పలేం” అంటూ సమాధానమిచ్చాడు. దాంతో కళ్యాణ్ రామ్ మనసులో పోలిటికల్ థాట్స్ ఉన్నాయనేది స్పష్టమైంది.