గతేడాది ‘బింబిసార’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘బింబిసార’ సూపర్ హిట్ అవ్వడంతో ‘అమిగోస్’పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తొలిసారి త్రిపాత్రాభినయం పోషించారు కళ్యాణ్ రామ్. అందులో ఒకటి విలన్ రోల్. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. నిర్మాతలు సినిమా హిట్ అని చెబుతున్నప్పటికీ.. కలెక్షన్స్ చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు.
సోమవారం నుంచి కలెక్షన్స్ లో మరింత డ్రాప్ కనిపిస్తోంది. వీకెండ్ వరకు ఐదు కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ యాక్షన్ ఫిల్మ్ ఇంకా రూ.7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ‘అమిగోస్’ అనే ఇంగ్లీష్ టైటిల్ జనంలోకి వెళ్లలేకపోయింది. దానికి తోడు సినిమా మొత్తం విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది.
దీన్ని జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ‘జై లవకుశ’ సినిమాకి మరో వెర్షన్ మాదిరి అనిపించింది కానీ సినిమాలో కొత్తగా ఏదీ అనిపించలేదు. కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమా ‘డెవిల్’. దీనికి కూడా ఇంగ్లీష్ టైటిలే పెట్టారు. స్వతంత్ర పోరాట నేపథ్యంలో గూఢచారిగా పని చేసిన ఓ సాహసవంతుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పాలి. కాబట్టి సినిమా కొత్తగా అనిపించే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఒక హిట్ వస్తే..
ఆ తరువాత కొన్ని ప్లాపులు పడుతుంటాయి. అదొక సెంటిమెంట్ గా మారిపోయింది. ‘అమిగోస్’ విషయంలో కూడా అదే జరిగింది. ‘డెవిల్’ సినిమా గనుక హిట్ అయితే ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ‘డెవిల్’ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవికి లేదా దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!