బాహుబలి2 సినిమా ని కించపరిచిన బాలీవుడ్ రివ్యూ రైటర్!
- May 1, 2017 / 05:31 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమా ఎంతటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే అంతేకాకుండా సినిమా టేకింగ్, గ్రాఫిక్స్ అంత చాలా ఆకట్టుకున్నాయి ఇప్పటికే మనకు అర్ధం అయిపోయింది. ఒక పక్క ప్రపంచం అంతటా బహుబలికి బ్రహ్మరధం పడుతూ ఉన్న క్రమంలో …బాలీవుడ్ లో ఒక రివ్యూ రైటర్ కి మాత్రం సినిమా నచ్చలేదు అంట. అంతేకాదు అసలు సినిమాలో ఏమీ లేదు అంటున్నాడు ఆ రైటర్. ఇంతకీ ఎవరు అతను అంటే, అతనే మన బాలీవుడ్ రివ్యూ రైటర్ కమల్ ఆర్ ఖాన్. అందరిదీ ఒకదారి అయితే, మనవాడు వేరే దారి ఎందుకుంటాడు, ఏదయినా చిత్రం విడుదల అయ్యిందంటే ఇక దాన్ని విమర్శించ డమే పనిగా జీవితాశయం గా పెట్టుకుంటాడు. ఈ మద్య విడుదలైన రాజమౌళి చిత్రం బాహుబలి 2 ని కూడా వదిలి పెట్టలేదు.
అంతేకాదు ఆ సినిమాపై, కథానాయకునిపై కూడా తీవ్ర విమర్శలు చేశాడు. హీరో ప్రభాస్ ఈ చిత్రంలో ఒక ఒంటెలా కనిపిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అసలు బాహుబలి 2 లో కథేమీ లేదనీ, గ్రాఫిక్స్ కూడా పరమ చెత్త గా చూపించారని విమర్శించాడు. రాజమౌళి ఇంత ఘోరంగా దర్శకత్వం చేస్తాడని తను అనుకోలేదని, ఇక సంగీతం కూడా పరమ దరిద్రంగా ఉంది అంటూ వ్యాఖ్యా నించాడు. “బాహుబలి 2 ది కంక్లూజన్” కంటే “బాహుబలి ది బిగినింగ్” చాలా గొప్పగా ఉందని అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డబ్బులు పోసి చూడటం వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతారంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు అంటే మాత్రం 5కి 1 ఇస్తాను అంటూ ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా ఈ రివ్యూ రైటర్ ఇలా కాంట్రొవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ పబ్బం గడుపుకోవడం తెలిసిన విషయమే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















