Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

సినిమాలైనా, వ్యక్తిగత జీవితమైనా ముక్కుసూటిగా మాట్లాడేయడం, ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం కమల్‌ హాసన్‌కు (Kamal Haasan) అలవాటు. అందుకే ఇన్నేళ్ల కెరీర్‌లో తనకంటూ వచ్చిన ఇమేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిలబెట్టుకుని ముందుకెళ్తున్నారు. అలాంటాయన దగ్గర మీ కెరీర్ గురించి చెప్పండది అంటే ఎంత కాన్ఫిడెంట్‌గా, ఎంత నిజాయతిగా చెబుతారు మీరే ఊహించుకోండి. ఆ ప్రశ్నే ఆయనకు ఇప్పుడు ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో ఎదురైంది. దానికి ఆయన ఎప్పటిలానే షాకింగ్ కామెంట్స్‌తో రిప్లై ఇచ్చారు.

Kamal Haasan

30 ఏళ్ల పాత కాంబినేషన్‌ను రిపీట్‌ చేస్తూ ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) అనే సినిమా చేశారు కమల్ హాసన్‌ – మణిరత్నం(Mani Ratnam) . ఈ సినిమాను జూన్‌ 5న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రచారం కోసం మీడియా ముందుకు వచ్చినప్పుడు కమల్‌కు ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మలయాళ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని తెలిపారు కమల్‌. ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసినా.. పరిశ్రమలోని దిగ్గజ దర్శక నిర్మాతలతో పని చేయలేకపోయినందుకు బాధపడ్డారు.

నా కంపెనీని నడపడానికి ఇప్పటికీ నేను సంపాదన వెంట పరుగెడుతున్నాను. నేను నా జీవితాన్ని నడపడానికి నా దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ అవసరం లేదు. కానీ సినిమాలు తీయడానికి ఇంకా డబ్బు అవసరం. అందుకే ఆర్థికంగా బలపడడం కోసం మాలీవుడ్‌ ఇండస్ట్రీని ఎంచుకున్నాను అని చెప్పారు. అయితే నేను సినిమా రంగంలోకి ప్రవేశించినా వాసుదేవన్‌ నాయర్‌, మృణాల్‌ సేన్ వంటి దిగ్గజాలతో సినిమాలు చేయలేకపోయాను అని తన నిరాశను వ్యక్తం చేశారు కమల్‌.

మూడేళ్ల వయసు నుండే సినిమాల్లో నటిస్తున్నాను. వయసు, అనుభవం మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. గతంలో మాదిరిగా ఇప్పడు సినిమా విడుదల రోజు ఆందోళన చెందడం లేదు. భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తాం, ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదు. అప్పుడు కొన్నిసార్లు ఆడియన్స్‌ను నిందిస్తుంటాం. కొన్నిసార్లు మమ్మల్ని మేమే నిందించుకుంటాం అని సినిమా ఫలితం గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఫలితాన్ని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది అని వివరించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus