అల్లు అర్జున్ (Allu Arjun) తన 22వ సినిమాని తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో (Atlee Kumar) చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ వీడియో ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఇచ్చారు. అట్లీ మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. అల్లు అర్జున్ కి కూడా దేశవ్యాప్తంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. సో వీళ్ళ కలయికలో రూపొందే సినిమా కూడా మాస్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే.. వీళ్ళు వేరే జోనర్లో మూవీ చేస్తున్నట్టు మేకింగ్ వీడియోతో ప్రకటించారు. ఫ్యాన్స్ కి ఎక్కడా మిస్ లీడ్ చేయకుండా..తమ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందో ముందుగానే చెప్పి మంచి పని చేశారు. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టైం ట్రావెల్ అండ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. ఇప్పటివరకు బన్నీ డబుల్ రోల్ చేసింది లేదు.
అయితే మొదటి సారి ఏకంగా ట్రిపుల్ రోల్ చేస్తుండటం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. కానీ వాస్తవానికి ఇందులో 5 మంది హీరోయిన్లు నటిస్తున్నట్టు లేటెస్ట్ టాక్. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) , జాన్వీ కపూర్(Janhvi Kapoor) , దీపికా పదుకోనె (Deepika Padukone) ఆల్రెడీ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అలాగే అనన్య పాండేకి (Ananya Panday ) కూడా లుక్ టెస్ట్ చేశారు. ఆమె కూడా దాదాపు ఫైనల్ అయినట్టే. మరోవైపు 5వ హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్సేని (Bhagyashree Borse) కూడా సంప్రదిస్తున్నట్టు వినికిడి.