Kamal, Rajini: ఎన్నో ఏళ్ల కల నెరవేరుస్తున్న మణిరత్నం!

ఇద్దరు అగ్ర హీరోలు ఒకే సినిమాలో కలసి నటించడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అందుకే ఏ ఆడియో ఫంక్షన్‌లోనో, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనో కనిపిస్తూ చూసి తరిస్తుంటారు అభిమానులు. ఇద్దరూ స్టార్‌లు అయిఉండి, చాలా తక్కువసార్లు ఒకే వేదిక మీద ఉండటం అంటే.. చాలా అరుదు. అలాంటి అరుదైన సీన్‌ను చూపించబోతున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. దీని మొదటి భాగం ప్రచారంలో భాగంగా ఈ ఫ్రేమ్‌ను మనం చూడొచ్చు.

అగ్ర హీరోలు రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ త్వరలో ఒకే వేదికపై తళుక్కున మెరవనున్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుకకు రజనీ, కమల్‌ ముఖ్య అతిథులుగా హాజరవ్వబోతున్నారు. ఈ నెల 6న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ వేడుక జరగనుంది. చిత్రం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఈ మేరకు ఇటీవల ప్రకటించింది. ‘‘ఈ ఇద్దరు కలిసి రావడానికి మించింది మరొక ఆనందం ఇంకొకటి లేదు’’ అంటూ రాసుకొచ్చింది లైకా టీమ్‌.

ఈ ప్రకటనతో సినిమా ప్రియులు, కమల్‌, రజనీకాంత్‌ అభిమానులు, నెటిజన్లు ఆనందపడిపోతున్నారు. ఎందుకంటే ఇద్దరి కాంబినేషన్‌, ఆ ఫ్రేమ్‌ అంత అద్భుతంగా ఉంటుంది మరి. కెరీర్‌ ప్రారంభంలో కమల్‌, రజనీ ‘16 వయథినిలే’, ‘థిల్లు ముల్లు’ లాంటి సినిమాల్లో కలసి నటించారు. ఆ తర్వాత ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి మంగళవారం ఆ స్నేహాన్ని కనులారా వీక్షించొచ్చు.

విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌, విక్రమ్‌ ప్రభు తదితరులు నటిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సినిమాకు తెలుగులో తనికెళ్ల భరణి మాటలు రాస్తున్నారు. చిరంజీవి నేపథ్య గళం అందించారని సమాచారం. తెలుగులో ఈ ఈవెంట్‌కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చే అవకాశమూ ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus