బాహుబలి కంక్లూజన్ చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళిని అభినందించక ఉండలేకపోతున్నారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు బాహుబలి బృందాన్ని ప్రశంసించారు. రెండు వారాల్లో 1250 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాపై విశ్వనటుడు కమలహాసన్ స్పందించారు. “సినీ పరిశ్రమ ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి సినిమాలు అవసరం. బాహుబలి ని చూస్తుంటే టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పడిన కష్టం కళ్ళముందు కనిపించింది. గొప్ప సంస్కృతి మనకు ఉందని ఈ సినిమా నిరూపించింది. ” అని అభినందించిన కమల్.. వెంటనే తనదైన శైలిలో విమర్శించారు.
“బాహుబలితో హాలీవుడ్‌ను మించిపోతామని సంబర పడనవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ గ్రాఫిక్సే. అందులో మన ప్రతిభ ఏమిలేదు. పైగా వాటిని గ్రాఫిక్స్ సమకూర్చింది కూడా హాలీవుడ్ టెక్నీషియన్లు. సో మన గొప్ప ఏమిలేదు” అని చెప్పారు. సినీ విశ్లేషకులకు కూడా కమల్ కౌంటర్ ఇచ్చారు. “మనకు రెండు వేల ఏళ్ల చరిత్ర ఉందని అంటున్నారు. కానీ అది నిజం కాదు. మనం 2000 వేల ఏళ్ల నాటివాళ్లం కాదు. కేవలం 70 ఏళ్ల వాళ్లమే. చంద్రగుప్త మౌర్య, అశోకులు నా పూర్వీకులు కాదు. వాళ్ల స్టోరీలు ఈ ఆధునిక కాలానికి సెట్ కావు” అని నవ్వుతూ పంచ్ లు వేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.