ప్రయోగాలు చేయాలన్నా, డేరింగ్ చేయలన్నా ఇండియన్ సినిమాలో తొలుత వినిపించే నటుడి పేరు కమల్ హాసన్ (Kamal Haasan). ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఆయన తన పంథాను కొనసాగిస్తున్నారు. నిత్య విద్యార్థి అనే మాట ఆయనకు బాగా సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి అదే పేరును సార్థకం చేసుకోవడానికి కమల్ హాసన్ రెడీ అయిపోయారు. అందు కోసమే అమెరికా వెళ్లారు అని టాక్ వినిపిస్తోంది. సాంకేతికతపై ఆసక్తి ఉన్న నటుల్లో కమల్ హాసన్ ఒకరు.
గతంలో ఆయన చాలా సినిమాల్లో సాంకేతికతను వినియోగించి చూపించారు కూడా. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు నేర్చుకునేందుకు రెడీ అయ్యారు. దీని కోసం ఆయన ఇటీవల అమెరికా వెళ్లినట్టు సమాచారం. ఓ టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో కమల్ హాసన్ శిక్షణ తీసుకోనున్నట్టు సమాచారం. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయంతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకోవడం, నేర్చుకోవడంలో కమల్ హాసన్ బిజీగానే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని, 90 రోజుల కోర్సులో చేరారని చెబుతున్నారు.
అయితే అన్ని రోజుల సమయం లేకపోవడంతో 45 రోజుల్లోనే కోర్సు పూర్తి చేయాలని ప్లాన్‌చేస్తున్నారట. అయితే సినిమా కోసం నేర్చుకుంటున్నారా? లేక వ్యక్తిగత ఆసక్తితోనా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమల్ హాసన్ (Kamal Haasan) సినిమాల సంగతి చూస్తే.. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది కాకుండా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్‌లోనూ నటించాల్సి ఉంది.
‘థగ్ లైఫ్’ సినిమా పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి కాబట్టి కొత్త కోర్సు ఆ సినిమా కోం కాదు అని చెప్పేయొచ్చు. ‘కల్కి 2898 ఏడీ’ కోసం కమల్ ఇప్పుడు శిక్షణ తీసుకునే అవసరం లేదు. దీంతో అయితే తర్వాతి సినిమా కోసం అవ్వాలి లేదంటే వ్యక్తిగతంగా నేర్చుకోవడానికైనా ఈ 45 రోజుల కోర్సు అయి ఉండాలి అని సమాచారం. చూద్దాం కమల్ (Kamal Haasan) ఆ కోర్సు పూర్తయ్యాక కానీ, మధ్యలో కానీ ఏదైనా సమాచారం ఇస్తారేమో.