Kamal Haasan: క్రేజీ ప్రాజెక్ట్‌ నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ ఫిక్స్‌ అట!

సౌతిండియా ఇటీవల కాలంలో భారీ సినిమాలు చాలా వస్తున్నాయి. టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, మాలీవుడ్‌… ఇలా ఏ వుడ్‌ తీసుకున్నా పెద్ద సినిమా పక్కా. అలాంటి పెద్ద సినిమాల్లో విలక్షణ నటులు ఉన్న విలక్షణ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతోంది. కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘విక్రమ్‌’ అనే సినిమా రూపొందుతోంది. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌… డీల్‌ ఓకే అయిపోయిందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు సాగితే… సినిమాకు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ విలువ ₹150 కోట్లు అని సమాచారం.

‘విక్రమ్‌’ సినిమాలో కమల్‌ హాసన్‌తోపాటు విజయ్‌ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌ లాంటి కీలక నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా కథ, కాన్సెప్ట్‌ ఏంటి అనేది తెలియకపోయినా… ఈ ముగ్గురు ఉన్నారని తెలియడంతో సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు రైట్స్‌ విషయంలోనూ అదే రెస్పాన్స్‌ అని తెలుస్తోంది. కమల్ హాసన్‌ సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. మరో ముఖ్య పాత్రను మలయాళ స్టార్ యాక్టర్‌ ఫహాద్ ఫాజిల్‌ చేస్తున్నాడు.

‘విక్రమ్’ చిత్రీకరణ 110 రోజులు సాగింది. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకొని సినిమాను సమ్మర్‌ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌ కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ మొత్తం వెచ్చించడానికి ముందుకొచ్చిందని టాక్‌. అలాగే హిందీ డబ్బింగ్‌ హక్కుల లెక్క కూడా కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. ఈ రెండూ కలిపితే ₹150 కోట్ల వరకు చిత్ర బృందం సంపాదించిందట. ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ కింద ఈ సినిమాకు ₹100 కోట్ల నుండి ₹120 కోట్ల వరకు వస్తుందట.

అలాగే హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ₹25 కోట్ల నుండి ₹30 కోట్ల వరకు వస్తున్నాయట. అలా మొత్తం నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ ₹150 కోట్ల వరకు ఉంటున్నాయని అంటున్నారు. చూద్దాం ఈ లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో. సినిమా మీదున్న హైప్‌కి ఈ అమౌంట్‌ రావడం అయితే పక్కా అని అంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus