బాహుబలి, బాహుబలి, బాహుబలి, ఇప్పటికీ ఎక్కడ విన్నా ఇదే మాట, హాలిడే అని లేదు, వర్కింగ్ డే అని లేదు సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకుపోవడం చూస్తుంటే మన తెలుగువాడి ఖ్యాతికి మరింత వన్నె తెచ్చేదిలా ఉంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే ఎందరో సెలెబ్రెటీస్, మహామహులు, పెద్దవాళ్ళు, సూపర్ డూపర్ అంటూ తమదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపించేశారు, అయితే అందరి మాట ఒకటైతే నాది మరొకటి అన్న ఆలోచనో, లేక అందరూ వెళ్లే దారిలో నేను వెళ్లను, అన్న ఆత్మ స్థైర్యమో తెలీదు కానీ, ఈ సినిమాపై మొట్టమొదటి సారి నోరు విప్పిన లోక నాయకుడు కమల్ మాత్రం సినిమా విషయంలో కొన్ని విచిత్రమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడే ఇవే హాట్ టాపిక్ గా మారి సినిమా సర్కిల్స్ లో హల్‌చల్ చేస్తూ ఉండడం విశేషం. విషయం ఏమిటి అంటే, ఈ సినిమా విషయంలో కమల్ మాట్లాడుతూ, ఆర్ధికంగా చూసుకుంటే ఈ సినిమా అందరి కష్టాన్ని తెలియచేస్తుందని అన్నారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకున్నారు.
అయితే బాహుబలి హాలీవుడ్ ను బీట్ చేస్తుంది అన్న వాదనను మాత్రం తాను ఒప్పుకోనని అన్నారు కమల్ హాసన్. బాహుబలి అంతా గ్రాఫిక్స్ మహిమే అని, హాలీవుడ్ ను క్రాస్ చేసేంత సినిమా లేదన్నట్టు మాట్లాడారు. ఇక మరో పక్క బాహుబలి కలక్షన్స్ సునామి కొనసాగుతూనే ఉంది. ఇండియాలోనే 1000 కోట్ల కలక్షన్స్ రాబట్టిన బాహుబలి టోటల్ వరల్డ్ వైడ్ 1300 కోట్లు దాటినట్టు తెలుస్తుంది. కేవలం హిందిలోనే 400 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. అదే క్రమంలో ఫుల్ రన్ లో 1500 కోట్లను టచ్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఒక్క యూఎస్ లోనే 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాహుబలి తనకంటూ ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకుంది. మొత్తంగా సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి, కొత్త కొత్త పాత్రలకు ప్రాణం పోసి సరికొత్తగా ఆవిష్కరించాలి అని ఎల్లప్పుడూ అనుకునే నటుడు కమల్ కి బాహుబలి పెద్దగా నచ్చలేదు అన్న విషయం, ఆయన మాటలతో అర్ధం అవుతుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.