Indian 2: ‘భారతీయుడు 2’ అది నిజమైతే థియేటర్లు షేక్ అవ్వడం గ్యారంటీ

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan) ద్విపాత్రాభినయం కనపరిచిన ‘భారతీయుడు’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శంకర్ (Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. మంచి మెసేజ్ తో పాటు టెక్నికల్ గా కూడా సౌత్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. ఇక 28 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.

2020 లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కానీ అనేక సమస్యలు తలెత్తడంతో షూటింగ్ డిలే అయ్యింది. మొత్తానికి ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కావస్తోంది. ‘లైకా ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘భారతీయుడు 2 ‘ (Indian 2) లో కమల్ హాసన్ తో పాటు సిద్దార్థ్ (Siddharth) , కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh), సముద్రఖని (Samuthirakani) , బాబీ సింహా (Bobby Simha) వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. అయితే ‘ఈ సినిమా కథ ఏమయ్యి ఉంటుంది?’ అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

‘భారతీయుడు’ లో కొడుకు పాత్రలో కనిపించే కమల్ హాసన్ చనిపోయినట్టు చూపిస్తారు. కానీ ఈ సీక్వెల్ లో అతని పాత్ర బ్రతికే ఉన్నట్టు చూపిస్తారని ఇన్సైడ్ టాక్. వారి మధ్య రివేంజ్ డ్రామా కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేము. జూన్ లో ‘భారతీయుడు 2 ‘ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus