కమల్ హాసన్ సినిమాల రిలీజ్ విషయంలో కూడా చోటు చేసుకోని నాటకీయత ఆయన పోలిటికల్ ఎంట్రీ విషయంలో గత రెండేళ్లుగా నడుస్తూనే ఉంది. ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ రెండేళ్ల నుండి తమిళనాడు పోలిటికల్ పార్టీస్ తోపాటు ఆయన అభిమానులను కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ మాత్రం తీరిగ్గా ఇన్నాళ్ల తర్వాత తన పోలిటికల్ ఎంట్రీ ప్రకటించాడు. ఇటీవల “విశ్వరూపం 2” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన కమల్ హాసన్ రేపు తన పుట్టినరోజు సందర్భంగా సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనున్నాడు. అలాగే.. తన పోలిటికల్ ఎంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వివరించనున్నాడు కమల్.
తొలుత బీజేపీ లేదా తమిళనాడు లోకల్ పార్టీస్ లో కమల్ హాసన్ జాయినవుతాడు అని వార్తలొచ్చినప్పటికీ.. వారెవ్వరితో కలిసే అవకాశం లేదని తానే స్వయంగా ఒక పార్టీ పెట్టబోతున్నారని ఆల్రెడీ ప్రకటించేశాడు. రేపు తన పుట్టినరోజును పురస్కరించుకొని పార్టీ పేరు కూడా వెల్లడించే అవకాశం ఉందని తమిళ సినీ మరియు రాజకీయవర్గాల విశ్వసనీయ సమాచారం. అలాగే.. కమల్ హాసన్ తాజా చిత్రం “శభాష్ నాయుడు” టీజర్ ను కూడా రేపు విడుదల చేయనున్నాడట కమల్. చూస్తుంటే.. 2019 లోపు ఒక అయిదారు సినిమాలు పూర్తి చేసి పాలిటిక్స్ వైపు కాన్సన్ ట్రేట్ చేస్తాడేమో కమల్ హాసన్.