ఆమెను సినిమాల్లోకి తీసుకోవద్దంటూ కమల్ హాసన్ ఆర్డర్.. అసలేం జరిగిందంటే..

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ స్పాట్‌లో జరిగిన ఏదైనా అనుకోని సంఘటన కారణంగానో.. తమ ముందో, వెనుకో ఎవరో ఏదో అన్నారనో అలిగి.. ఏళ్ల తరబడి మాట్లాడుకోని వాళ్లు, కలిసి నటించని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల మధ్య ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ కొద్ది కాలానికి మళ్లీ కలిసిపోయారు. ఇలాగే స్టార్ హీరో కమల్ హాసన్, టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికకు మధ్య ఓ వివాదం చెలరేగింది.. తన పక్కన రాధికను సినిమాల్లోకి తీసుకోవద్దని కూడా కమల్..

దర్శక నిర్మాతలకు చెప్పేవారంటేనే.. వారి మధ్య గొడవ తారా స్థాయిలో జరిగే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.. ‘స్వాతిముత్యం’ తో పాటు అంతకుముందే పలు తమిళ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అసలేం జరిగిందో వివరంగా చూద్దాం.. అది 1977 టైం.. సూపర్ స్టార్ కృష్ణ, ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు, రోజా, రాధిక తదితరులు ప్రధాన తారాగణంగా.. ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘ఎన్‌కౌంటర్’ అనే సినిమా వచ్చింది. మూవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా..

తాను చేసిన తల్లి పాత్రకు మంచి పేరొచ్చిందని.. రాధిక చెన్నైలో మీడియా వారితో చెప్పారు. అలా ఇంటర్వూ మొదలైంది.. మాటల మధ్యలో కమల్ హాసన్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి షాకిచ్చారు.. ‘‘భారతీయుడు’ సినిమాలోనూ, అంతకుముందు ‘మైకేల్ మదన కామరాజు’ చిత్రంలోనూ నన్ను అడగాలని అనుకున్నారట. కానీ నన్ను పెట్టొద్దని కమల్ ప్రొడ్యూసర్లకి చెప్పాడంట. అయినా ఆ పాత్రలు చెయ్యలేకపోయానని నేనేం బాధపడిపోవటం లేదు లెండి.. కాకపోతే కొందరి బుద్ధులు అలా ఉంటాయి’’ అన్నారు..

అలాగే.. తన చెల్లెలు నిరోషాతో కలిసి నటించినప్పుడు కూడా ముద్దు సీన్‌లో నిరోషా నోట్లో నోరు పెట్టి కిస్ చెయ్యడానికి ప్రయత్నించి అల్లరి పెట్టాడని, అలా ముద్దు పెట్టుకోనివ్వనందుకు.. ‘అలాంటప్పుడు సినిమాల్లోకి ఎందుకొచ్చావ్?.. హీరోయిన్‌గా నిలబడాలంటే అన్నీ చెయ్యాలి’ అని క్లాస్ తీసుకున్నాడని చెప్పింది. కమల్ హాసన్‌తో తనకు నేరుగా ఏ గొడవా జరుగకపోయినా.. కమల్ భార్య సారిక మాత్రం ఒక సందర్భంలో తన గురించి ఎవరి దగ్గరో నీచంగా మాట్లాడిందని..

ఆ విషయం తెలిసి తాను కూడా సారిక గురించి అంతే నీచంగా ఆ వ్యక్తి దగ్గర మాట్లాడి.. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోమని చెప్పండి.. నోరు పారుసుకుంటే అంతకంతా అనుభవించాల్సి వస్తుందని చెప్పండి’ అని కబురు పంపడంతో.. సారిక ఇంకెక్కడా చెప్పుకోడాని క్కూడా వీల్లేని తన మాటలకు నోరు మూసుకుందని ఫ్లాష్ బ్యాక్ చెప్పింది రాధిక. దీంతో కమల్ హాసన్ సినిమాల్లో రాధికకు వేషాలు రాకుండా పోవడానికి ఆ గొడవే కారణం అని అప్పుడే అందరికీ తెలిసింది..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus