Kamal Haasan: పవన్ కళ్యాణ్ తరహాలోనే ఓటమిపాలైన కమల్

  • May 3, 2021 / 11:13 AM IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడ్డాయి. లోకనయకుడు కమల్ హాసన్ తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్న అంచనాలు ఒక్కసారిగా తారుమరయ్యాయి. ఆంద్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తరహాలోనే ఆయన కూడా ఓటమి చెందడం హాట్ టాపిక్ గా మారింది. మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీని స్థాపించి గత రెండేళ్లుగా పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కమల్ గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారని అనుకున్న కమల్ హాసన్ ఇతర పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడింది.

వారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ ప్రకటించుకున్నారు. అయితే 142స్థానాల్లో పోటీ చేసిన వారందరు కూడా ఓటమి పాలవ్వగా చివరికి కమల్ హాసన్ కూడా గెలవలేకపోయారు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ఆయన ప్రత్యర్థి వనతి శ్రీనివాసన్ ‌(బీజేపీ) 1,300 ఓట్ల తేడాతో గెలిచారు. ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ కమల్‌హాసన్ ఓటమి చెందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొన్ని రౌండ్ల వరకు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ చివరి రౌండ్లలో కమల్ హాసన్ ఆధిక్యం సాదించలేకపోయారు.

పవన్ కళ్యాణ్ తరహాలోనే ఆయన కూడా దారుణమైన ఓటమి చెందడంతో భవిష్యత్తు రాజకీయాల్లో సినీ తారల రాజకీయ నిర్ణయంపై ప్రభావం చూపనుందని చెప్పవచ్చు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి డీఎంకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus