వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది ‘తలైవి’ సినిమా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం చేశారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ ను థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయంపై పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘తలైవి’ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించబోమని ప్రకటించారు. దీనిపై కంగనా అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవీఆర్, ఐనాక్స్ ల తీరుని తప్పుబట్టింది. థియేటర్లకు ప్రేక్షకులు రాక కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికే నిర్మాతలు సంకోచిస్తున్న సమయంలో ఇలా రూల్స్ విధించడం ఏంటంటూ విమర్శించింది. అయితే కంగనా ఎటాక్ నేపథ్యంలో పీవీఆర్ స్పందించింది. ‘తలైవి’పై పెట్టిన ఆంక్షల విషయంలో సడలింపులు ఇచ్చింది.
తెలుగు, తమిళ వెర్షన్లను ఓటీటీలో నెల రోజుల వ్యవధి తరువాత విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిని మాత్రం పీవీఆర్ థియేటర్లలో ప్రదర్శిస్తామని చెప్పింది. హిందీ వెర్షన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది. కరోనా ఎఫెక్ట్ తో ఇంతకాలం ఆగి థియేటర్లలోనే ‘తలైవి’ని రిలీజ్ చేయాలనుకోవడం అభినందనీయమని.. కానీ మంచి అంచనాలున్న ఈ సినిమాను రెండు వారాలకే హిందీలో ఓటీటీలో రిలీజ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని పీవీఆర్ పేర్కొంది.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!