ఇండస్ట్రీలో ఏం జరిగినా… నేనున్నా అంటూ ముందుకొస్తుంటుంది కంగనా రనౌత్. సాయం సంగతి పక్కనపెడితే మాటల యుద్ధం మొదలెడుతుంది. అయితే ఈ మధ్య కంగనక్క చూపు రాజకీయాల మీదకు వెళ్లింది. తరచుగా ఓ పార్టీని సపోర్టు చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆమెకు సినిమా ఇండస్ట్రీ నుండి, రాజకీయాల నుండి మాటల తూటాలు తగులుతూనే ఉన్నాయి. నెపోటిజం విషయంలో ఆమె చేసిన ఉద్యమానికి వెన్నంటే ఉన్న నెటిజన్లు… ఇప్పుడు ఆమెనే ట్వీట్లతో పొడుస్తున్నారు.
కంగన రనౌత్‌ను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. అందులో దేశంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ గురించి మాట్లాడింది. ఈ క్రమంలో లాక్‌డౌన్ వల్ల సరైన వసతి, భోజనం లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటూ కొందరు చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఎప్పటిదో పాత ఫొటో తీసుకొచ్చి… లాక్‌డౌన్ టైమ్‌ది అంటున్నారు అంటూ… కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించింది. ఆ తర్వాతే కంగన పప్పులో కాలేసింది. ఎక్కడో నైజీరియాలోని ఫొటోను తీసుకొచ్చి… గంగా నదిలో మృత దేహాలు అంటూ ట్వీట్లు చేస్తున్నారు అని కంగన విమర్శించింది. దీంతో నెటిజన్లు తమ ట్వీట్లకు పని చెప్పారు.
గంగా నదిలో ఇటీవల కాలంలో వరుసగా పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. గంగా నది ఒడ్డున ఆ మధ్య మృతదేహాలు తేలాయి. దీనికి కారణమేంటి, అవి కరోనా మృతదేహాలా అనేది తేల్చడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయి. అయితే ఈలోగా కంగన ఆ ఫొటోలు నైజీరియావి అని చెప్పింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ నెటిజట్లు ట్వీట్ చేస్తున్నారు. ‘నైజీరియా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉందా’ అంటూ ఆ నది పక్కన ఉత్తర్‌ప్రదేశ్ అని హిందీలో రాసిన బోర్డు ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా రకరకాలు ఆమెకు ట్వీట్ల పోట్లు మొదలయ్యాయి. దీనికి మరి కంగన ఏమంటుందో?
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!