బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా. తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తూ.. కాంట్రవర్సీ క్వీన్ గా ముద్ర వేసింది. ఎలాంటి విషయాన్నైనా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటుంది కంగనా. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. అలానే ఆమె మాటలు విని ఆమెకి అభిమానులుగా మారిన వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. కొన్నాళ్లక్రితం కంగనాపై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేరులో కోర్టు హాజరు నుంచి శాశ్వత మినహాయింపు కోసం దరఖాస్తు పెట్టుకుంది కంగనా. ఈ దరఖాస్తుని ముంబై కోర్టు తిరస్కరించింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ,విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా విన్నవించుకుంది. దీనిపై రియాక్ట్ అయిన కోర్టు.. కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలని గుర్తుచేసింది.
ఆ విషయాన్ని ఆమె మర్చిపోకూడదని చెప్పింది. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు మండిపడింది. ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని స్పష్టం చేసింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని కంగనా తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది.
రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ ఆమెపై పరువునష్టం దావా వేశారు. అప్పటినుంచి కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. ఇప్పటికే కంగనా చాలాసార్లు హియరింగ్ ఎగ్గొట్టింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?