Kangana Ranaut: డైరెక్టర్ కరెంట్ జోహార్ వ్యాఖ్యలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కంగనా తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కంగనా తాజాగా కరణ్ జోహార్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కంగనా ప్రస్తుతం చంద్రముఖి 2,ఎమర్జెన్సీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా గురించి స్పందిస్తూ…

తాను ఈ సినిమా చూడటం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలపై కంగనా స్పందించారు. ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ కరణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. కరణ్ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా…హా హా లాస్ట్ టైం నేను నటించిన మనికర్ణిక సినిమా కూడా చూడాలని ఎక్సైట్ గా ఉంది అంటూ కామెంట్ చేశారు.

అలాగే ఈ సినిమా విడుదలైన వారానికి నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ కొందరికి డబ్బు ఇచ్చి మరి నా సినిమా పట్ల విషయ ప్రచారం చేపించారు. ఇప్పుడు మరోసారి అదే చేయబోతున్నారు. ఇలా ఉన్నఫలంగా నేను నటించిన సినిమా చూడాలని ఉంది అంటూ మీరు వ్యాఖ్యానించడం చాలా విడ్డూరంగా ఉందని, మీరు అలా మాట్లాడుతుంటే నాకు నిజంగానే భయం వేస్తుందని

మరోసారి నా సినిమాపై ఇలాంటి ప్రయోగాలైన చేస్తారేమోనని భయంగా ఉంది అంటూ ఈ సందర్భంగా కరణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కంగనా చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus