Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Kangana, Kantara: కాంతార సినిమా పై కంగనా హాట్ కామెంట్స్!

Kangana, Kantara: కాంతార సినిమా పై కంగనా హాట్ కామెంట్స్!

  • October 21, 2022 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana, Kantara: కాంతార సినిమా పై కంగనా హాట్ కామెంట్స్!

కన్నడ సినిమా ‘కాంతార’ మీద దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. రిషభ్‌ శెట్టి సినిమా తీసిన విధానం, నటించిన విధానం, చూపించిన విధానం.. ఇలా అన్నీ ప్రశంసలు అందుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమాను పొగుడుతూ కంగన తన రివ్యూ చెప్పింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇంతకీ కంగన ఏం చెప్పిందంటే? చిన్న సినిమాగా మొదలై.. ఇప్పుడు ఆకాశాన్ని అంటిన చిత్రం ‘కాంతార’.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ సినిమా చూసిన వెంటనే అల్లు అరవింద్‌ లాంటి నిర్మాత ముందుకొచ్చి తెలుగులో విడుదల చేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక వసూళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడలో మూడో హయ్యెస్ట్‌ గ్రాసర్‌ అంట. తెలుగులోనూ వసూళ్లు బాగున్నాయి అంటున్నారు. ఇక కంగన ఏం చెప్పిందో చూస్తే… ‘‘ఈ సినిమా ఇప్పుడు నా కుటుంబంతో కలసి చూశాను. ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి.

అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇది. రిషభ్‌ శెట్టి నీ హ్యాట్సాఫ్‌. నీ రైటింగ్‌, డైరెక్టింగ్‌, నటన, యాక్షన్‌ అన్నీ అద్భుతంగా ఉన్నాయి’’ అంటూ తెగ మెచ్చేసుకుంది. అంతేకాదు సినిమాలో స్థానిక ఆచార వ్యవహారాలు, పద్ధతులు, పరిస్థితుల్ని బాగా వివరించి చూపించారు అని మరింత వివరంగా చెప్పింది కంగన. సినిమా అంటే ఇదీ.. దీనిని సినిమా అంటారు అంటూ సినిమా మీద తన అభిమానాన్ని చూపించిన కంగన.. ఈ సినిమా ప్రభావం నుండి నేను బయటపడటానికి మరో వారమైనా పడుతుంది. సినిమా అయిపోయి రిటర్న్‌ వస్తున్నప్పుడు చాలామంది మాటలు విన్నా.

ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఇప్పటివరకు మేం చూడలేదు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్‌ రిషభ్‌ శెట్టి అని వీడియో ముగించింది కంగన. కంగన సౌత్ సినిమాను మెచ్చుకోవడం ఇదే తొలిసారి కాదు. పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అవుతున్న, అయిన ప్రతి సినిమాను మెచ్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో హిందీ సినిమా ఎందుకు తక్కువ, ఎలా తక్కువ అనే ఎత్తిపొడుపు మాటలు కూడా ఉంటాయి. అయితే ఈ వీడియో అలాంటివేం లేవు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut
  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

9 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

9 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

13 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

13 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

4 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

4 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

7 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

8 hours ago
Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

Tripti Dimri: ‘స్పిరిట్’… సందీప్ కాన్ఫిడెన్స్ ను తక్కువ అంచనా వేశారు.. కానీ..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version