Adipurush: ఆదిపురుష్ పై అలాంటి కామెంట్లు చేసిన కంగనా.. ఏమైందంటే?

కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వివాదాలు, కంగనా రనౌత్ పక్కపక్కనే ఉంటాయని చాలామంది భావిస్తారు. కంగనా ఎప్పుడు ఏ విషయం గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తారో, ఏ విషయం గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తారో ఎవరూ అంచనా వేయలేరనే సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా పేరు ప్రస్తావించకుండా ఇన్ స్టా స్టోరీ ద్వారా కంగనా కామెంట్లు చేయడం గమనార్హం.

రామాయణంలోని కొన్ని ఘట్టాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన కంగనా రనౌత్ ప్రస్తుతం నివశించే వాళ్లతో పోల్చి చూస్తే కొన్నేళ్ల క్రితం ప్రజల భాష, వాళ్ల అలవాట్లు, వాళ్ల ప్రేమాభిమానాలు ఎంతో ఎమోషన్స్ తో కూడినవిగా ఉండేవని ఆమె చెప్పుకొచ్చారు. మరి అలాంటప్పుడు ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రజలు ఏ విధంగా ఉండేవారని వాళ్ల వేషధారణ ఏ విధంగా ఉండేదో ఊహించగలరా అని కంగనా చెప్పుకొచ్చారు. కంగనా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కంగనా రనౌత్ కామెంట్ల విషయంలో ఆదిపురుష్ టీం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. కంగనాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఆదిపురుష్ మూవీ రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆదివారం కలెక్షన్లతో కలిపి ఆదిపురుష్ మొత్తం కలెక్షన్లు 300 కోట్ల రూపాయలు దాటే ఛాన్స్ ఉంది.

వీక్ డేస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ వీక్ డేస్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus