Kangana Ranaut: ఒకరిని అనేముందు నీ సంగతి చూసుకో: నెటిజన్లు

కనిపించిన ప్రతి మనిషిని విమర్శించడం, దొరికిన ప్రతి విషయం మీద కామెంట్‌ చేసి వైరల్‌ చేయడం, ఇండస్ట్రీలో స్టార్ల మీద నోరు పారేసుకోవడం. ఇలాంటి పనులు చేసేవాళ్లు ఎవరు అంటే వినిపించే తొలి రెండు, మూడు పేర్లలో ఒక పేరు కంగనా రనౌత్‌. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో కామ్‌గానే ఉన్న కంగన… ఆ తర్వాత ఇండస్ట్రీ తనను చాలా ఇబ్బంది పెట్టిందని, కొంతమంది చేతుల్లోనే ఇండస్ట్రీ నలిగిపోతోందని విమర్శలు చేసింది. ఆ తర్వాత హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసి… అంతా తానే అనుకోవడం ప్రారంభించింది.

Click Here To Watch

ఇవన్నీ మా మాటలు కావు. సోషల్‌ మీడియాలో కంగన పోస్టులు కింద, ఇతరులను ఆమె విమర్శించే చేసే వ్యాఖ్యల కింద నెటిజన్ల మాటలు. తాజాగా కంగన ‘గెహ్రహియా’ సినిమా గురించి మాట్లాడింది. కొత్తదనం పేరుతో చెత్త తీసుకొచ్చి ప్రేక్షకుల మీద రుద్దొద్దు అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేసింది. నేనూ కొత్తతరానికి చెందిన మహిళనే. కానీ సినిమలో చూపించిన రొమాన్స్‌ని నిజమైన రొమాన్స్‌గా భావిస్తున్నా. అంతే కానీ కొత్తతరం, అర్బన్‌ సినిమా పేరుతో దయచేసి చెత్త అమ్మకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలే’’ అని కామెంట్‌ చేసింది కంగన.

అంతేకాదు స్కిన్‌ షో చేసినంత మాత్రాన ఆ సినిమాలో పాత్రలు మంచివి కాలేవు అంటూ దీపిక పడుకొణె, అనన్య పాండే ఎక్స్‌పోజింగ్‌ గురించి మాట్లాడింది. అయినా స్కిన్‌ షో సినిమాకు విజయం అందించలేదనే విషయం, అవి సరైన పాత్రలు కావనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం ‘గెహ్రాహియా’ వాళ్లకు తెలియలేదా? అంటూ విమర్శించింది కంగన. అయితే ఇప్పుడు ఈ కామెంట్ల విషయంలో కంగన విమర్శలు ఎదుర్కుంటోంది. ఇలాంటి పాత్రలు నువ్వు గతంలో చేశావు కదా. సినిమాకు అవసరం లేకపోయినా స్కిన్‌ షో చేశావు కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

కంగన రనౌత్‌ గతంలో బికినీలు వేసుకొని నటించిన ఫోటోలు బయటికి తీసి మరీ కామెంట్లు చేస్తున్నారు. కంగన త్వరలో ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా చేయనుంది. ఆ షో ప్రచారం కోసం ఆమె చేసిన ఎక్స్‌పోజింగ్‌, స్కిన్‌ షో గురించి కామెంట్లు కనిపిస్తున్నాయి. కంగనా… ఇతరులను విమర్శించేటప్పుడు ముందు నీ సంగతి నువ్వు చూసుకో అంటూ విమర్శిస్తున్నారు. అయితే కంగన ఇవేవీ పట్టించుకోదు. తనను ఎవరూ ఏమీ అనకూడదు, తను మాత్రం అందరినీ అనేయొచ్చు అనే కాన్సెప్ట్‌లో ఉంది కదా.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus