Kangana, Hrithik: రియాలిటీ షోలో స్టార్ హీరోపై కంగనా కామెంట్స్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ‘లాకప్’ అనే షోని హోస్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ఈ షో రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ షోలో కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. షోలో ఓ మేల్ కంటెస్టెంట్ తో ఫిమేల్ కంటెస్టెంట్ ప్రేమలో పడినట్లుంది. అయితే అతడికి ఆల్రెడీ పెళ్లై, బిడ్డ కూడా ఉంది. ఈ విషయంపై కంగనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో పెళ్లైన మగాళ్ల గురించి మాట్లాడింది. ఈ రోజుల్లో అమ్మాయిలు పెళ్లయిన పురుషుల ఆకర్షణలో పడిపోతున్నారని కంగనా మాట్లాడేలోపు.. తన కేస్ వేరంటూ సదరు కంటెస్టెంట్ చెప్పే ప్రయత్నం చేశాడు. వెంటనే కంగనా.. తన మాటలు అతడిని ఉద్దేశించి కాదని.. జెనరల్ గా చెబుతున్నా అంటూ కంటిన్యూ చేసింది. తన జీవితంలో ఇలాంటి ఒక సిట్యుయేషన్ చోటుచేసుకుందని చెప్పింది. పెళ్లయి, పిల్లలున్న మగాళ్లు అమ్మాయిలను ఆకట్టుకునేందుకు కట్టుకథలతో రకరకాల జిమ్మిక్కులు చేస్తారని..

ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు, హీరోలు సైతం ఇలాంటి పనులు చేస్తూ అందమైన అమ్మాయిలను బుట్టలో వేసుకుంటున్నారని చెప్పుకొచ్చింది. ఇది తన జీవితంలో జరిగిన పెద్ద స్కాండిల్ అని.. వారు చాలా కథలు చెబుతుంటారని తెలిపింది. అతడు చెప్పే మాటలు విని.. ఆ పెళ్లయిన వ్యక్తిని అతని భార్య నుంచి రక్షించగలిగేది తామేనని చాలామంది యువతులు భావిస్తారు. కానీ వారి భార్యల వైపు స్టోరీ వింటే ఖచ్చితంగా అందరూ షాక్ అవుతారని పేర్కొంది.

అయితే కంగనా చేసిన ఈ కామెంట్స్‌ ఆమె మాజీ ప్రియుడు హృతిక్‌ రోషన్‌ని ఉద్దేశించినవేనని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. హృతిక్ తన భార్య నుంచి విడిపోవడానికి కారణం కూడా ఈ ఎఫైర్ అనే చెబుతారు. ప్రస్తుతం హృతిక్.. సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus