తన బయోపిక్ పై సంచలన నిర్ణయం తీసుకున్న కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏం చేసినా ఒక సంచలనమనే చెప్పాలి. తన ముక్కు సూటి తనం వలనో… ‘బోల్డ్ యాటిట్యూడ్’ వలనో రకరకాల గొడవలు తెచ్చుకుంటూ ఉంటుంది. మిగిలిన సెలెబ్రిటీల పై కూడా ఎక్కడా లేని కామెంట్స్ చేస్తూ వివాదాలకి తెరలేపుతూ ఉంటుంది కంగనా. ఇటీవల ‘మణికర్ణిక’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది కంగనా రనౌత్ . అనేక వివాదాల తరువాత విడుదలైన ఈ చిత్రం.. అటు తరువాత కూడా చాలా వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘మణికర్ణిక’ చిత్రీకరణ సమయంలోనే క్రిష్.. కంగనాకు విభేదాలు రావడంతో తప్పుకున్నానని… కంగనా వలనే సోనూసూద్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడని క్రిష్ తాజాగా చెప్పిన సంగతి తెలిసిందే. తరువాత కంగనా కూడా దీని పై స్పందించి పెద్ద రచ్చే చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ సంచలన ప్రకటన చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే… తన బయోపిక్ ను స్వయంగా తానే తెరకెక్కించబోతున్నానని ప్రకటించింది కంగనా. ఇప్పటికే బయోపిక్ కు సంబంధించిన యూనిట్ ను కూడా సిద్ధం చేసుకుందట. ‘బాహుబలి’, ‘మణికర్ణిక’ చిత్రాలకు కథను అందించిన విజయేంద్ర ప్రసాదే ఈ బయోపిక్ కు కథను రెడీ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ‘మణికర్ణిక’కు పని చేసిన టెక్నికల్ టీమ్ అంతా కంగనా బయోపిక్ కి పనిచేయబోతున్నారట. అయితే కంగనా సెల్ఫ్ డబ్బా కొట్టుకునేలా ఈ చిత్రం ఉండదని … ఆమె జీవితంలో ఎదుర్కొన్న అనేక సంఘటనలను ఈ చిత్రంలో చూపబోతున్నట్టు కంగన టీమ్ తెలిపింది. కంగన జీవితంలో ఆమెను ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారట, ఆ వ్యక్తులను కూడా చిత్రంలో చూపిస్తామని కంగనా టీం చెబుతుంది. ప్రస్తతం ఈ వార్త వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని 6 నెలల్లో ఫినిష్ చేయడానికి కంగనా ప్లాన్ కలిగి ఉందట. మరి ఈ చిత్రంలో ఎవరెవరి పై సెటైర్లు వేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus