Kangana Ranaut: ఒకేసారి ముగ్గురు స్టార్‌ హీరోలంటున్న ఫైర్‌బ్రాండ్‌.. ఏంటీ మార్పు అంటూ..

కొన్నిసార్లు అన్ని రోజులూ మనవి కావు అని ఎవరికైనా చెప్పాలి అనుకుంటే.. బాలీవుడ్‌ని, హిందీ నటుల్ని చూపించాలి. ఎందుకంటే కరోనా – లాక్‌డౌన్‌ ముందువరకు ఇండియన్‌ సినిమా అంటే మేమే, మేం చేసిన సినిమాలే హిట్‌, మేం ఏది చేస్తే అదే హిట్‌ అనుకునేవారు. ఒక్కోసారి అయితే తాము పోషించే పాత్రలను తమకు తాము ఆపాదించుకునేవారు కూడా. ఈ తరహాలో మొత్తంగా నేనే అనుకుని దర్శకుల్ని తక్కువ చేసిన కథానాయిక కంగన రనౌత్‌ (Kangana Ranaut) .

Kangana Ranaut

ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అనుకుంటున్నారా? గతంలో ఈ ఫైర్‌బ్రాండ్‌ బాలీవుడ్‌లో ఏకైక లేడీ సూపర్‌స్టార్‌ అని ఫీల్‌ అయ్యేది. ఈ క్రమంలో అగ్ర హీరోలు తన కంటే తక్కువే అని కొన్నిసార్లు, వారితో సమానం నేను అని మరికొన్నిసార్లు అనేది. అయితే ఇప్పుడు వరుస పరాజయాలు ఆమెను గ్రౌండ్‌కి తీసుకొచ్చాయి. అయితే తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం ఆమె బాలీవుడ్‌ ముగ్గురు ఖాన్‌ల గురించి మాట్లాడటమే.

కంగనా రనౌత్‌ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency) . మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితంలోని కొన్ని ఘట్టాలను ఈ సినిమాలో చూపించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌ మీట్‌లో ఆమె .. బాలీవుడ్‌ అగ్ర హీరోలు ఆమిర్ ఖాన్‌ (Aamir Khan) , షా రుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) , సల్మాన్‌ ఖాన్‌తో (Salman Khan) సినిమా గురించి వేసిన ప్రశ్నకు డిఫరెంట్‌గా స్పందించారు. ముగ్గురు ఖాన్‌లతో సినిమాలను డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నారా? అని అడిగితే.. ‘ముగ్గురితో ఒకేసారి సినిమా నిర్మించాలనుకుంటున్నా.

దానికి నేనే దర్శకత్వం వహిస్తాను అని సమాధానం ఇచ్చింది. అంతేకాదు ఆ ముగ్గురితో సినిమా తీస్తే నా సినిమాకు గ్లామర్ పెరుగుతుంది. ఆ సినిమాతో సమాజానికి మంచి సందేశం ఇవ్వగలరు. అలా ఆ సినిమా ఇండస్ట్రీలో గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది అని కంగన అంది. ఈ మాటల విషయంలో ఖాన్‌ల అభిమానులు అయితే.. ఏదో వెటకారంగా అన్నట్లుంది అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే మీరు మారిపోయారు మేడం అని కామెంట్లు చేస్తున్నారు.

‘ఆయ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus