తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కంగనా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. నిజానికి తలైవి సినిమాలో జయలలిత పాత్రను కంగనా పోషించడమే సంచలనమైంది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఇప్పుడు సినిమా చుట్టూ ఆర్ధిక వివాడాలు ముసురుకున్నాయి. తమకు తెలియకుండా తమ సొమ్ముని దొంగతనంగా భాగస్వాములు ఈ సినిమాలో పెట్టారని ఆరోపిస్తున్నారు విబ్రి మీడియా పార్ట్నర్స్.
‘తలైవి’ సినిమాని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇందులో విబ్రి మోషన్ పిక్చర్స్ అనే సంస్థ వ్యవహారంలోనే గొడవలు బయటపడ్డాయి. విబ్రి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో హైదరాబాద్ లో ఉన్న సంస్థలో విబ్రి మోషన్ పిక్చర్స్ అధినేతలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇందూరి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన భర్త బ్రిందా ప్రసాద్.. విబ్రి మోషన్ పిక్చర్స్ సంస్థకు, విబ్రి మీడియా నుంచి రూ.75 లక్షలు అక్రమంగా మళ్లించారని… ఆ డబ్బుతోనే ‘తలైవి’ సినిమా తీశారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ మేరకు విబ్రి మీడియాలో పార్ట్నర్ గా ఉన్న కార్తీక్ కృష్ణన్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈరోజే ‘తలైవి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఈ ఆరోపణల నుండి చిత్రనిర్మాతలు ఎలా బయటపడతారో చూడాలి!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!