నిన్న సాయంత్రం (అక్టోబర్ 29) హైదరాబాద్ లో జరిగిన “క” (KA) ప్రీరిలీజ్ ఈవెంట్లో హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మాట్లాడుతూ ఓ సంస్థ మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కిరణ్ అబ్బవరం మీద సోషల్ మీడియాలో జరిగిన, జరుగుతున్న ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే.. ఒక సినిమాలో కిరణ్ అబ్బవరాన్ని ట్రోల్ చేశారనే విషయం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. కానీ.. నిన్న కిరణ్(Kiran Abbavaram) ఆ విషయం గురించి మాట్లాడుతూ “జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ ఉంటది, వాళ్ల సినిమాలో నన్ను ట్రోల్ చేశారు.
అసలు నన్ను అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది?” అంటూ తాను పడ్డ ఆవేదనను స్టేజ్ మీద పంచుకున్నాడు కిరణ్ అబ్బవరం. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియా జనాలు “షెర్లాక్ సంపత్”లుగా మారిపోయి, ఏమిటా సినిమా? ఏమిటా సీన్? అంటూ రీసెంట్ గా వచ్చిన సినిమాలన్నీ జల్లెడ పడుతున్నారు. ఆల్రెడీ కొందరు ఆ సీన్ ఏమిటి అనేది పోస్ట్ కూడా చేసేసారు కానీ.. అదేనా, కాదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు, రావడానికి పెద్ద టైమ్ పట్టదు అనుకోండి.
అదే సమయంలో.. నాగచైతన్య మాట్లాడి కిరణ్(Kiran Abbavaram) ను ఓదారుస్తూ ఈ ట్రోల్స్ చేసేవాళ్ళని పట్టించుకోకు అని చెప్పడంతో ఆ స్టేట్మెంట్ కు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. ఇకపోతే.. అక్టోబర్ 31న “క” సినిమా తెలుగులో మాత్రమే విడుదలవుతుండగా, ఇవాళ (అక్టోబర్ 30) సాయంత్రం హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేశారు.
మీడియాకి కూడా ఇవాళ సాయంత్రమే సినిమా చూపిస్తున్నారు. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ రిస్క్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) & టీమ్. మరి వాళ్ళ నమ్మకాన్ని సినిమా ఏమేరకు నిలబెడుతుందో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
అసలు కిరణ్ అబ్బవరం తో ప్రాబ్లెమ్ ఏంటి?
నా మీద సినిమా లో ట్రోలింగ్ చేశారు!
8 సినిమాల్లో 4 డీసెంట్ ఫిలిమ్స్ అంటే నేను ఫెయిల్యూర్ యాక్టర్ కాదు!#KA #KiranAbbavaram pic.twitter.com/JI4krqJCgX
— Filmy Focus (@FilmyFocus) October 29, 2024