Bobby Deol: కంగువా.. విలన్ రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే!

సూర్య (Suriya) – శివ  (Siva)  కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’ (Kanguva) నవంబర్ 14న విడుదలైంది. అయితే భారీ బడ్జెట్‌తో అత్యంత గ్రాండియర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. స్టోరీలో బలం లేకపోవడం, స్క్రీన్‌ప్లే స్లోగా ఉండటం వంటి కారణాల వల్ల సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే సూర్య యొక్క డెడికేషన్, నటనకు మాత్రం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన బాబీ డియోల్ (Bobby Deol) పాత్రపై మాత్రం డిఫరెంట్ రివ్యూలు వినిపిస్తున్నాయి.

Bobby Deol

ట్రైలర్‌లో బాబీ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా చూపించినప్పటికీ, స్క్రీన్‌లో మాత్రం అతని పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. అయితే బాబీ డియోల్‌కు ఈ సినిమా కోసం ఏకంగా 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘యానిమల్’ (Animal) తర్వాత బాబీ డిమాండ్ పెరగడంతో, అతని క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి మేకర్స్ పెద్ద మొత్తాన్ని వెచ్చించారు. కంగువా తర్వాత బాబీ డియోల్ (Bobby Deol) టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.

బాలకృష్ణ (Nandamuri Balakrishna)  హీరోగా వస్తున్న ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా కూడా పీరియాడికల్ జోనర్‌లోనే తెరకెక్కుతోంది. బాలయ్య సినిమాల్లో విలన్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ సినిమాలో బాబీ డియోల్ తన పాత్రకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా బాబీ దాదాపు 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

బాబీ డియోల్ తెలుగులో మరిన్ని అవకాశాలను పొందేందుకు ఈ రెండు చిత్రాలు కీలకంగా మారనున్నాయి. ‘డాకు మహారాజ్’ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్   (Pawan Kalyan)  నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)   సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. ఇక రాబోయే సూపర్ హిట్ కాంబినేషన్స్ తో బాబీ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పుష్ప 2 రిజెక్ట్ చేయకపోవడానికి కారణమిదే..: థమన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus