విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత లు హీరోయిన్లుగా … నయన్ తార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కె.ఆర్.కె'(‘కన్మణి రాంబో కటీజా’). తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నోరు తిరగలేని పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో మంచి విలన్ గా, సహాయ నటుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు కానీ హీరోగా అతన్ని ఇక్కడి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసింది లేదు.
ఇక నయనతార ఇమేజ్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. అయితే సమంత వల్ల ఈ చిత్రం పై మొదటి నుండీ మంచి బజ్ ఏర్పడింది.2019 లో రావాల్సిన ఈ మూవీ వాయిదాలు పడుతూ వచ్చి ఏప్రిల్ 28న విడుదలైంది.’ఆచార్య’ కు పోటీగా రిలీజ్ అయిన ఈ మూవీ బిలో యావరేజ్ టాక్ ను రాబట్టుకోవడంతో పెద్దగా కలిసి రాలేదు. ఇక్కడ ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా మొదటి రోజు ఓకే అనిపించిన ఈ మూవీ ఆ తర్వాత మళ్ళీ రంజాన్ రోజున కాస్త క్యాష్ చేసుకుంది.
ఆ తర్వాత కొన్ని రోజులు డీసెంట్ గా నడిచింది తప్ప బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఒకేసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
0.51 cr
సీడెడ్
0.25 cr
ఉత్తరాంధ్ర
0.20 cr
ఈస్ట్ + వెస్ట్
0.14 cr
గుంటూరు + కృష్ణా
0.17 cr
నెల్లూరు
0.10 cr
ఏపి+తెలంగాణ
1.37 cr
‘కన్మణి రాంబో కటీజా’ చిత్రానికి రూ.2.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.1.37 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బయ్యర్లకి రూ.0.68 కోట్ల నష్టం వాటిల్లింది.ప్రమోషన్లు గనుక ఈ చిత్రానికి బాగా చేసి ఉండుంటే మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉండేది. సినిమాకి వచ్చిన టాక్ ను బట్టి అయితే బాగానే కలెక్ట్ చేసింది కానీ ఓవరాల్ గా అయితే ప్లాప్ అనే చెప్పాలి.