కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన‌ ల‌వ్ మాక్‌టైల్ 2 ఈనెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ ఈనెల 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు

ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. డార్లింగ్ కృష్ణ నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించ‌డ‌మే కాక త‌నే హీరోగా నటించి మెప్పించాడు. కన్నడలో ఈ లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలవ‌గా.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ : కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో అనువదించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడని. అతను దర్శకత్వం చేస్తూ నటించిన ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను చూసి బాగుందని రిలీజ్ చేయడానికి ఇష్టపడి కొనుక్కున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :
డార్లింగ్ కృష్ణ, మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్

టెక్నికల్ టీం :
నిర్మాణం : కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
మ్యూజిక్ : నకుల్ అభయాన్కర్
లిరిసిస్ట్ : గురు చరణ్
మ్యూజిక్ లేబుల్ : జాంకర్ మ్యూజిక్
డిఓపి మరియు ఎడిటర్ : శ్రీ క్రేజీ మైండ్స్
కథ మరియు దర్శకత్వం : డార్లింగ్ కృష్ణ
పి ఆర్ ఓ : మధు VR

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus