కన్నడ హీరోయిన్ల క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్రస్తుతం కన్నడ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కన్నడ హీరోయిన్లు తక్కువ పారితోషికానికే సినిమాకు ఓకే చెప్పడంతో పాటు ఇండస్ట్రీలో మంచి పేరును సొంతం చేసుకుంటున్నారు. గతంలో కూడా పలువురు కన్నడ హీరోయిన్లు ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడ హీరోయిన్లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. కన్నడ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్న తెలుగులో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

రష్మిక ఇప్పటికీ వరుస ఆఫర్లతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. మరో కన్నడ హీరోయిన్ శ్రీలీల వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ యంగ్ జనరేషన్ హీరోయిన్లకు షాకిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలీల రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సినిమాసినిమాకు శ్రీలీల మార్కెట్ ను పెంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

కన్నడ హీరోయిన్లైన అషిక రంగనాథ్, కావ్యా శెట్టిలకు తెలుగులో ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి. కృతిశెట్టిది ముంబై అయినా ఆమె కూడా కన్నడ మూలాలు ఉన్న నటి అనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న శ్రీనిధి శెట్టికి కూడా తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి. మరికొన్ని సంవత్సరాల పాటు తెలుగులో కన్నడ హీరోయిన్ల హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.

యంగ్ జనరేషన్ హీరోలకు జోడీగా కూడా కన్నడ హీరోయిన్లకు సినిమా ఆఫర్లు వస్తుండటం గమనార్హం. కన్నడ హీరోయిన్లు అటు గ్లామరస్ రోల్స్ లో, ఇటు అభినయ ప్రధాన పాత్రల్లో మెప్పిస్తూ ఫ్యాన్స్ కు దగ్గరవుతున్నారు.రాబోయే రోజుల్లో మరి కొందరు కన్నడ హీరోయిన్లు టాలీవుడ్ సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus