దర్శకధీరుడు రాజమౌళి ‘తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే కర్ణాటకలో మాత్రం పరిస్థితి తారుమారుగా ఉందని సమాచారం. ఈ సినిమాపై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ వర్సెస్ ‘జేమ్స్’ అంటూ రెండు సినిమాల మధ్య తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తరువాత ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కర్ణాటకలో అత్యధిక థియేటర్లలో రన్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతూ ఉండగానే ఏకంగా 270 థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పునీత్ సినిమాను తొలగించారు.
ఇలా సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పటికీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం తమ అభిమాన హీరో సినిమాని తొలంగించడం పట్ల కన్నడ ప్రేక్షకులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ని ఈ విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తప్పు ఎవరిదనే విషయం పక్కన పెడితే.. మంచి కలెక్షన్స్ తో థియేటర్లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోన్న సినిమాను ఎలా తొలగిస్తారంటూ..?
ఫిల్మ్ ఛాంబర్ పెద్దలపై శివరాజ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందనేది తెలియదు. ఇదిలా ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో శివరాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో ఆయనకు మంచి బాండ్ కూడా ఉంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?