Kannappa: మంచు వారి మెమరబుల్‌ ప్రాజెక్ట్‌కి ఇంటర్నేషనల్ హైప్‌.. ఏం చేస్తున్నారంటే?

సినిమా పరిశ్రమ అంటే ప్రపంచ సినిమా పరిశ్రమ ఎంతో గొప్పగా చెప్పుకునే సినిమా ఉత్సవం ‘కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్’. ఏటా జరిగే ఈ ఉత్సవంలో మామూలుగా అయితే సినిమా తారల ర్యాంప్‌ వాక్‌లు ఉంటాయి అనుకుంటారు కానీ.. అక్కడ ప్రపంచవ్యాప్త సినిమాలు ప్రదర్శిస్తారు. వాటికి అవార్డులు కూడా ఇస్తారు. కొంతమంది సినిమా జనాలు అయితే తమ సినిమాల్ని అక్కడ ప్రచారం చేసుకుంటుంటారు కూడా. గతంలో కొన్ని ఇలా జరిగాయి. అంతటి ప్రతిష్ఠాత్మక వేదిక మీద ఈసారి మన తెలుగు నేలలో పుట్టిన సినిమా ప్రచారం చేసుకోబోతోంది.

మంచు కుటుంబంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) . మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాకు అన్నీ తానై చూసుకుంటున్నారు మంచు మోహన్‌బాబు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు మోహన్‌బాబు (Mohan Babu) నిర్మాత. చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారు అని చెబుతున్నారు. ఈ లోపు సినిమా ప్రచారం షురూ చేస్తున్నారు. దీని కోసం పైన చెప్పిన కాన్స్‌ను వేదికగా చేసుకున్నారు.

ఈ నెల 20న కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని మంచు తెలిపారు. కాన్స్‌ చిత్రోత్సవాల్లో ‘కన్నప్ప’ సినిమా టీజర్‌ను ఆవిష్కరిస్తున్నాం అని విష్ణు చెప్పారు. భారతీయ చరిత్రను ప్రపంచ వేదికపైకి తీసుకురావడం, మన కథలు, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రేక్షకులకు తెలియజేయడమే మా లక్ష్యం. అందుకే మేము ఎంతో ఇష్టంగా రూపొందిస్తున్న ‘కన్నప్ప’ను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కాన్స్‌ ఓ అనువైన వేదిక అని విష్ణు చెప్పారు.

ఇక ఈ సినిమాలో మోహన్‌లాల్‌(Mohanlal) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), శరత్‌కుమార్‌ (R. Sarathkumar) , ప్రభాస్‌(Prabhas) , అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar).. ఇలా అగ్ర తారలు చాలామంది నటిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు బయటకు రాగా ఇంకొందరు స్టార్‌ నటులు, నటీమణులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం వస్తున్నారు అని టాక్‌. ఒక్కో పేరు త్వరలో రివీల్‌ చేస్తారట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus