Kannappa: కన్నప్పలో స్టార్స్ ఎంత సేపు కనిపిస్తారు?

ఒక్కోసారి ఓ సినిమా మీద అంచనాలు కేవలం కథ వల్ల మాత్రమే కాకుండా, అందులో నటించిన స్టార్స్ కారణంగా కూడా పెరుగుతాయి. మంచు విష్ణు (Manchu Vishnu)  కన్నప్ప (Kannappa)  విషయంలో అదే జరుగుతోంది. భక్తి యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం, కేవలం పాన్ ఇండియా మూవీగా కాకుండా, ఇండస్ట్రీలోనే అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కుతోందనే పేరు తెచ్చుకుంది. ప్రభాస్ (Prabhas)  , మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar)  లాంటి స్టార్ నటుల ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం వల్ల సినిమా మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

Kannappa

అయితే, ఈ స్టార్స్ నిజంగా సినిమాలో ఎంతసేపు కనిపిస్తారు? అన్నదానిపై రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. సినిమాలో (Kannappa) వీరి పాత్రలు కేవలం చిన్న గెస్ట్ అప్పియరెన్స్‌లా ఉంటాయా లేక అసలు కథలో కీలకంగా భాగమవుతారా అన్నది భారీ చర్చకు దారి తీసింది. ఇటీవల కొన్ని రూమర్స్ వైరల్ అవుతూ, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు కేవలం కొన్ని నిమిషాల వరకు మాత్రమే ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ తాజాగా విష్ణు మంచు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

స్టార్ నటులు కేవలం చిన్న రోల్స్ చేయడం లేదని, స్క్రీన్ టైమ్ పరంగా చూస్తే, వారి పాత్రలు కథలో చాలా బలంగా ఉండేలా డిజైన్ చేశామని ఆయన తెలిపారు. విష్ణు మాటల ప్రకారం, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ పాత్రలు కథలో ప్రధాన మలుపులను తీసుకువస్తాయని తెలుస్తోంది. యుద్ధ సన్నివేశాలు, భక్తి అంశాలు, థ్రిల్లింగ్ మోమెంట్స్ అన్నీ కలిసి వారి పాత్రలను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. గెస్ట్ అప్పియరెన్స్‌గా కనిపించాల్సిన చోట, వారికి నిజమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్కోప్ ఉందని విష్ణు చెబుతున్న మాటలు, ఈ సినిమా మీద హైప్‌ను మరింత పెంచాయి.

ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రో సాంగ్ అలాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కన్నప్పకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఇది అత్యంత గ్రాండియస్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందట. ఇక వీరి పాత్రలకు ఇచ్చిన ప్రాముఖ్యత వల్ల, సినిమా మొత్తం కథనం మరింత బలంగా, ఎమోషనల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా (Kannappa)  ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus