Rishab Shetty: రిషబ్ శెట్టి ‘పుష్ప’ లో ఆ పాత్రను రిజెక్ట్ చేశాడట..!

రిషబ్ శెట్టి.. గత మూడు వారాలుగా ఈ పేరు ట్రెండింగ్లో ఉంది. ‘కాంతార’ అనే ఒక్క చిత్రంతో దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు ఈ డైనమిక్ హీరో కమ్ దర్శకుడు. ‘కె.జి.ఎఫ్’ నిర్మాతలతో కలిసి ‘కాంతార’ అనే చిత్రాన్ని కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ మూవీ కన్నడంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో అయితే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి ఇప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తుంది.

షేర్ పరంగా రూ.22 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. భూత కోలా వంటి ఎపిసోడ్స్ ను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు అంటూ రిషబ్ శెట్టి పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతను గతంలో తెలుగులో స్వరూప్ ఆర్.ఎస్.జె తెరకెక్కించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీలో కూడా నటించాడన్న సంగతి ఈ మధ్యనే అందరికీ తెలిసింది. అంతేకాదు ఇతను ఓ టాలీవుడ్లో రూపొందిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంలో నటించే ఛాన్స్ ను కూడా మిస్ చేసుకున్నాడట.

అది మరేదో కాదు అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప'( ‘పుష్ప ది రైజ్) చిత్రం. ఈ మూవీలో జాలి రెడ్డి పాత్రకు మొదట రిషబ్ శెట్టిని సంప్రదించారట. కానీ అతను వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల ఆ పాత్రను చేయలేను అని చెప్పినట్లు సమాచారం. మరోపక్క రిషబ్ శెట్టి ఆ పాత్రను రిజెక్ట్ చేయడమే మంచిదయ్యింది అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అలాంటి నెగిటివ్ రోల్ లో కనుక రిషబ్ శెట్టి తెలుగులో ఎంట్రీ ఇస్తే.. వెంటనే హీరోగా యాక్సెప్ట్ చేయడం కష్టమయ్యేది. అప్పుడు విలన్ గా ఇంకో రెండు మూడు సినిమాలు అతను చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే ‘కాంతార’ చిత్రంతో తెలుగులో కూడా రిషబ్ కు మంచి ఇమేజ్ ఏర్పడింది. ‘కాంతార 2’ వచ్చినా ఇక్కడ భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus