కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ కుమ్మేస్తుంది అని చెప్పాలి.
ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
7.76 cr
సీడెడ్
2.43 cr
ఉత్తరాంధ్ర
2.60 cr
ఈస్ట్
1.59 cr
వెస్ట్
1.02 cr
గుంటూరు
1.24 cr
కృష్ణా
1.29 cr
నెల్లూరు
0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
20.70 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
20.91 cr (షేర్)
‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 16 రోజులు పూర్తయ్యేసరికి రూ.20.91 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.18.91 కోట్ల భారీ లాభాలను అందించింది.
నిన్న కూడా ఈ మూవీ రూ.1.8 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ వారం కూడా సినిమాలు లేవు కాబట్టి.. ఓటీటీ రిలీజ్ అయ్యే వరకు ‘కాంతార’ కుమ్మేసే అవకాశం ఉంది.