కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం నిన్న అంటే అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు కామెంట్స్ చేశారు.దీంతో మొదటి రోజు మార్నింగ్ షోలు ఈవెనింగ్ షోలు డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి కుమ్మేసింది.
దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా ఊరమాస్ కలెక్షన్లను నమోదు చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
2.09 cr
సీడెడ్
0.63 cr
ఉత్తరాంధ్ర
0.60 cr
ఈస్ట్
0.42 cr
వెస్ట్
0.26 cr
గుంటూరు
0.31 cr
కృష్ణా
0.27 cr
నెల్లూరు
0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.11 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.87 cr (షేర్)
కాంతారా చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ రెండో రోజులు పూర్తయ్యేసరికి రూ.4.87 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.2.87 కోట్ల లాభాలను అందించింది. ఆదివారం రోజున ఈ మూవీ రూ.ఏకంగా రూ.2.82 కోట్ల షేర్ ను రాబట్టింది.