Kantara Collections: 27వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘కాంతార’

  • November 11, 2022 / 07:50 PM IST

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు అనే చెప్పాలి. మూడో వారంలోకి ఎంటర్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది.

4 వ వారం పూర్తి కావస్తున్నప్పటికీ ఈ మూవీ దూకుడు తగ్గలేదు అనే చెప్పాలి. తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు నిలబడలేకపోతుండగా.. డబ్బింగ్ సినిమా 4 వ వారంలో కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండడం విశేషం. ఒకసారి 27 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 12.27 cr
సీడెడ్ 3.02 cr
ఉత్తరాంధ్ర 3.49 cr
ఈస్ట్ 2.04 cr
వెస్ట్ 1.27 cr
గుంటూరు 1.58 cr
కృష్ణా 1.61 cr
నెల్లూరు 0.93 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 26.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 26.44 cr (షేర్)

‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 27 రోజులు పూర్తయ్యేసరికి రూ.26.44 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.24.44 కోట్ల భారీ లాభాలను అందించింది.

నిన్న కూడా ఈ మూవీ రూ.0.12 కోట్ల పైనే షేర్ ను అందించింది. కొత్త సినిమాలు ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడం గ్రేట్ అనే చెప్పాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus