పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన కాంతార (Kantara) సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలా రిషబ్ శెట్టి (Rishab Shetty) దర్శకత్వంలో రూపొందుతున్న కాంతార ప్రీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం నుంచి సాగుతున్న కథను మరింత విస్తృతంగా మలచడానికి రిషబ్ శెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈసారి ప్రీక్వెల్‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి అదనంగా, భారీ యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకోనున్నాయని సమాచారం. తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం, ప్రీక్వెల్‌లో ఒక గ్రాండ్ వార్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ యాక్షన్ సీన్ మరింత వాస్తవికంగా ఉండేలా రూపొందించేందుకు అంతర్జాతీయ యాక్షన్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి నెల రోజుల పాటు కాలరిపయట్టు అనే ప్రాచీన యుద్ధకళ శిక్షణ పొందుతున్నారని తెలుస్తోంది. కేరళలో పుట్టుకుచెందిన ఈ యుద్ధకళలో రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా, వార్ సీన్‌లో పాల్గొనే నటీనటులు అందరూ ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.
ఇది మాత్రమే కాకుండా, ఈ సన్నివేశం చిత్రీకరణ 80% సినిమా పూర్తి అయిన తర్వాతనే జరుగుతుందని సమాచారం. రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం పాత్రల ప్రాముఖ్యతను మరింత పెంచుతూ, నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ప్రతి అంశం పై దృష్టి పెట్టారు. మొదటి భాగంలో భూతకోలాటం ప్రధాన నేపథ్యంగా ఉండగా, ఈసారి మరింత లోతుగా కథను మలుస్తున్నారు.
తొలి భాగం సాధించిన సక్సెస్ చూస్తే, ఈ ప్రీక్వెల్ కూడా పాన్ ఇండియా స్థాయిలో మరింత పెద్ద విజయాన్ని అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి భాగం 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ప్రీక్వెల్ ఈ రికార్డులను దాటి కొత్త చరిత్ర సృష్టించగలదని అందరూ ఆశిస్తున్నారు. మొత్తానికి, కాంతార ప్రీక్వెల్ రిషబ్ శెట్టి సినిమాటిక్ విజన్‌ను మళ్లీ ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఇక సినిమాను ఈ ఏడాది మే నెలలో విడుదల చేయనున్నారు.