నిర్మాత బాధ చూడలేక బాత్రూమ్ వీడియో లీక్ చేసిన హీరోయిన్!

డాకు మహారాజ్  (Daaku Maharaaj) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మరోసారి మీడియాలో హైలెట్ గా మారింది. బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చేసిన “డాకు మహారాజ్” పాటల్లో ఆమె దబిడి దిబిడి స్టెప్స్ వైరల్‌గా మారడంతో పాటు వివాదాలకూ హాట్ టాపిక్ గా మారింది. కేవలం పాటలకే పరిమితం కాకుండా కీలక పాత్రలో మెప్పించిన ఊర్వశి, యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకుంది. ఈ విజయంతో ఊర్వశి టాలీవుడ్‌లో తనకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చూడాలని ఉవ్విల్లూరుతోంది.

Urvashi Rautela

ఇటీవలి ఇంటర్వ్యూలో ఊర్వశి తన కెరీర్‌లో గతంలో జరిగిన ఒక వివాదంపై స్పందించింది. 2022లో విడుదలైన “ఘుస్పైతియే” సినిమా ముందు ఆమె బాత్రూమ్ వీడియో లీక్ కావడం పెద్ద చర్చగా మారింది. ఈ వీడియోలో ఆమె ఒక బాత్రూమ్ సీన్‌లో కనిపించింది. ఈ వీడియో లీక్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు, ఈ విషయంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఘుస్పైతియే నిర్మాతలు తన వద్దకు వచ్చి సినిమా పైన పెద్దగా బజ్ లేదని, హైప్ క్రియేట్ చేయడానికి ఆ వీడియోను లీక్ చేయాలని వేడుకున్నారని ఊర్వశి చెప్పింది. “సినిమా నిర్మాణంలో చాలా ఖర్చు పెట్టి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిర్మాతలను చూస్తూ నేను ఆ వీడియోను లీక్ చేయడానికి ఒప్పుకున్నా. నా దృష్టిలో అది తప్పు కాదు, ఎందుకంటే నిర్మాతలు సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు,” అని ఊర్వశి చెప్పుకొచ్చింది.

ఈ వివాదాస్పద వీడియో గురించి మాట్లాడుతూ, “ఇది ఒక సీన్ మాత్రమే. నేను ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించాను. కానీ, సోషల్ మీడియాలో అది వైరల్ కావడంతో ప్రజలు దానిని వివాదం చేయడానికి ప్రయత్నించారు. ఆ వీడియోతో మహిళలకు సురక్షితంగా ఉండాల్సిన సందేశం ఇవ్వగలిగాం,” అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక డాకు మహారాజ్ విజయంతో ఊర్వశి రౌతేలా టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను పొందాలని ఆశపడుతోంది.

ప్రశాంత్ వర్మ – రానా.. ఇది ఫిక్స్ అయిపోయినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus