‘క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్’ బ్యానర్ పై జి.ధనంజయన్, లలిత ధనంజయన్ ల నిర్మాణంలో ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘కపటదారి’. సుమంత్,నందిత శ్వేతా జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదల అయ్యింది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు ఆకట్టుకునే విధంగానే ఉండడంతో ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కవలుదారి’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే టాక్ బాగున్నప్పటికీ ఈ చిత్రం కనీసం ఓపెనింగ్స్ ను కూడా నమోదు చెయ్యలేకపోయింది.
ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 0.10 cr |
సీడెడ్ | 0.04 cr |
ఉత్తరాంధ్ర | 0.04 cr |
ఈస్ట్ | 0.04 cr |
వెస్ట్ | 0.03 cr |
గుంటూరు | 0.03 cr |
కృష్ణా | 0.03 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.01 cr |
ఓవర్సీస్ | 0.01 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.36 cr |
‘కపటదారి’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.1.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా వరకూ ఈ చిత్రాన్ని నిర్మాతలు ఒన్ రిలీజ్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే.. రూ.2.2కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 0.36 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 1.86 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇంత ఘోరమైన ఓపెనింగ్స్ తో వీకెండ్స్ లో ఈ చిత్రం నిలబడుతుందని ఏమాత్రం నమ్మకం లేదు. సుమంత్ ఈ సారి కూడా నిరాశపరిచాడు. కనీసం డబ్బింగ్ సినిమాలకు వచ్చిన కలెక్షన్లలో సగం కూడా ఈ చిత్రానికి నమోదు కాలేదు అంటే సుమంత్ బ్యాడ్ ఫామ్ కి.. ఇది నిదర్శనం అనే చెప్పాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!