Karan Johar: అంత గట్స్ నాకు లేవు కరణ్ జోహార్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కరణ్ జోహార్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఏ విషయంలోనైనా మొహమాటం లేకుండా ఇతరులను ప్రశ్నించే వ్యక్తిత్వం ఈయనకు ఉందనే సంగతి మనకు తెలిసిందే. ఇలా నిర్మొహమాటంగా ఏ విషయం గురించైనా సెలబ్రిటీలను అడిగేసే కరణ్ ఒక విషయంలో మాత్రం షారుక్ ఖాన్ అడగాలంటే భయం వేస్తుంది అంటూ కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

షారుఖ్ ఖాన్ ని అడిగే అంత ధైర్యం నాకు లేదు అంటూ తాజాగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్ ఖాన్ ను గురించి కరణ్ ఏం అడగాలనుకున్నారు అసలు ఏంటి అనే విషయానికి వస్తే… షారుక్ ఖాన్ ఇన్ని రోజులపాటు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఇబ్బందులలో ఉన్న సమయంలో ఈయన పఠాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించారు. అయితే ఈ సినిమా విడుదలైనటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే ఈయన జవాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ద్వారా కూడా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ పరువు కూడా నిలబెట్టారు అని చెప్పాలి.

ఇలా ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఈయన క్యామియో రోల్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఈయన రెండు సినిమాలలో ఇలా క్యామియో పాత్రలలో నటించారు. బ్రహ్మాస్త్ర సినిమాలోనూ అలాగే టైగర్ త్రీ సినిమాలో కూడా నటించారు. ఇకపోతే తాజాగా తాను తెరకెక్కించిన రీసెంట్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని లో షారుఖ్ నటించాల్సి ఉందని.. నేను అడిగితే షారుక్ నటిస్తారు కానీ ఆయనని అడిగే అంత ధైర్యం గట్స్ నాకు లేవు అంటూ ఈ సందర్భంగా (Karan Johar) కరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus