పంజాబ్ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య బాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ మర్డర్ ను చేసిందనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. వీరిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేష్ కాంబ్లే కూడా ఉన్నారు. అయితే సిద్ధేష్ ను విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ను కిడ్నాప్ చేయాలని ఈ ముఠా అనుకుందట.
కరణ్ జోహార్ ను కిడ్నాప్ చేసి ఆయన నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బుని రాబట్టాలని ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్ లకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సల్మాన్ కు పోలీసులు సెక్యూరిటీ కూడా పెంచారు. ఇంతకముందు 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామనే బెదిరింపు వచ్చాయి.
మొత్తానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కరణ్ జోహార్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్ లో ఉండడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!